●‘సన్’డే.. మండే..
అనంతపురం అగ్రికల్చర్: ‘సన్’ డే చుక్కలు చూపించింది. ఆదివారం గార్లదిన్నెలో 40.1 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. పామిడి, బెళుగుప్ప, పెద్దవడుగూరు, తాడిపత్రి, పుట్లూరు, యాడికి, శింగనమల తదితర మండలాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. శ్రీ సత్యసాయి జిల్లా తాడిమర్రి, చెన్నేకొత్తపల్లి, తలుపుల, ఎన్‌పీ కుంట, కొత్తచెరువు, పెనుకొండ, పుట్టపర్తి తదితర మండలాల్లో 39 డిగ్రీల నుంచి 40 డిగ్రీల వరకు నమోదయ్యాయి. మిగతా ప్రాంతాల్లో 37 నుంచి 39 డిగ్రీల మధ్య రికార్డయ్యాయి. గత కొన్ని రోజులుగా మడకశిర, శెట్టూరు, బెళుగుప్ప, కనగానపల్లి, రాప్తాడు, గుడిబండ, సోమందేపల్లి తదితర కొన్ని మండలాల్లో మాత్రమే ఉదయం 14 నుంచి 17 డిగ్రీల వరకు కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతుండగా మిగతా ప్రాంతాల్లో 20 డిగ్రీల మేర నమోదవుతూ సెగలు పుట్టిస్తున్నాయి. దీంతో జనం ఆందోళన చెందుతున్నారు. ఈ సారి ఏప్రిల్, మే నెలలో చాలా మండలాల్లో 45 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రత నమోదు కావచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment