బీటెక్ విద్యార్థి అదృశ్యం
నల్లమాడ: ఎద్దులవాండ్లపల్లికి చెందిన లక్ష్మీకాంత్‌రెడ్డి అనే బీటెక్ విద్యార్థి అదృశ్యమయ్యాడు. వివరాలిలా ఉన్నాయి. రామ్మోహన్‌రెడ్డికి ఇద్దరు సంతానం. వీరు కొన్నేళ్ల క్రితం బెంగళూరుకు వలస వెళ్లి స్థిరపడ్డారు. పెద్ద కుమారుడు లక్ష్మీకాంత్‌రెడ్డి అనంతపురంలోని ప్రైవేట్ కళాశాలలో బీటెక్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. ఈ నెల ఏడో తేదీన లక్ష్మీకాంత్‌రెడ్డి బెంగళూరుకు వస్తున్నానని తండ్రికి ఫోన్‌లె చెప్పి స్వగ్రామం ఎద్దులవాండ్లపల్లి నుంచి ద్విచక్రవాహనంలో బయల్దేరాడు. కొంతసేపటి తర్వాత తండ్రి ఫోన్ చేయగా స్విచాఫ్ అని వచ్చింది. అనుమానం వచ్చి అనంతపురం, బెంగళూరు ప్రాంతాల్లో గాలించినా కుమారుడి ఆచూకీ కన్పించలేదు. దీంతో రామ్మోహన్‌రెడ్డి శనివారం నల్లమాడ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ నరేంద్రరెడ్డి తెలిపారు.
విద్యుదాఘాతంతో వ్యక్తి మృతి
పుట్లూరు: నాయకునిపల్లి సమీపంలో శనివారం ఉదయం విద్యుదాఘాతంతో రామమునిరెడ్డి (40) అనే వ్యక్తి మృతి చెందాడు. వివరాలు ఇలా ఉన్నాయి. విద్యుత్‌శాఖలో సిబ్బంది కొరత కారణంగా కొన్నేళ్లుగా రామమునిరెడ్డి ఆ శాఖ అధికారులకు, సిబ్బందికి సహాయకుడిగా పనిచేసేవాడు. ఈ క్రమంలో పుట్లూరుకు చెందిన ఓబులేసు పొలంలో ట్రాన్స్‌ఫార్మర్ వద్ద విద్యుత్ తీగలు సరిచేస్తున్న సమయంలో షాక్‌కు గురై చనిపోయాడు. ఎస్‌ఐ వెంకటనరసింహ సంఘటన స్థలాన్ని పరిశీలించి, మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తాడిపత్రి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. రామమునిరెడ్డి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.
బీటెక్ విద్యార్థి అదృశ్యం
Comments
Please login to add a commentAdd a comment