●మద్యం.. మరణ శాసనం
కుటుంబాల్లో చిచ్చుపెట్టడంతో పాటు ఎందరినో బలితీసుకుంటున్న మద్యం మహమ్మారికి గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ముకుతాడు వేయగా.. కూటమి సర్కార్ వచ్చీరావడంతోనే మద్యం అమ్మకాలను ప్రైవేటు వ్యక్తులకు అప్పగించింది. ఊరూరా బెల్టుషాపులతో మద్యాన్ని ఏరులైపారిస్తోంది. ఎప్పుడు కావాలంటే అప్పుడు అందుబాటులోకి తెచ్చింది. ఫలితంగా మందుబాబులు నిత్యం మత్తులోనే తూగుతున్నారు. తక్కువ ధరకే దొరికే చీప్ సరుకు ఒక్కోసారి ప్రాణాలే తీస్తోంది. ఈ క్రమంలోనే సుమారు 55 నుంచి 60 సంవత్సరాల వయస్సు గల గుర్తు తెలియని వ్యక్తి గురువారం మద్యంమత్తులో ఇలా అనంతపురం ఆర్టీసీ బస్టాండు మరుగుదొడ్ల వద్ద ప్రాణాలు వదిలాడు. మృతదేహాన్ని ప్రభుత్వ సర్వజనాసుపత్రి మార్చురీలో భద్రపరిచినట్లు త్రీ టౌన్ సీఐ శాంతిలాల్ తెలిపారు. బంధువులు ఎవరైనా మృతదేహాన్ని గుర్తుపడితే సమాచారం ఇవ్వాలని కోరారు.
– అనంతపురం
●మద్యం.. మరణ శాసనం
Comments
Please login to add a commentAdd a comment