ఉపాధ్యాయులను విస్మరించిన ప్రభుత్వం
అనంతపురం ఎడ్యుకేషన్: కూటమి ప్రభుత్వం ఉపాధ్యాయులను విస్మరించిందని వైఎస్సార్ టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు పోచంరెడ్డి అశోక్‌కుమార్‌రెడ్డి విమర్శించారు. ఏపీ వైఎస్సార్ టీచర్స్ అసోసియేషన్‌కు ప్రభుత్వ గుర్తింపు వచ్చి ఏడాదైన సందర్భంగా శుక్రవారం నగరంలోని వైఎస్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా అశోక్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ వైఎస్సార్ హయాంలో సక్సెస్ స్కూల్స్ ద్వారా ఇంగ్లిష్ మీడియంను తీసుకొచ్చి 36 వేలమంది టీచర్లకు ప్రమోషన్లు ఇచ్చారన్నారు. వివిధ డీఎస్సీల ద్వారా ఎంపికై న ఉపాధ్యాయులు రెండేళ్ల అప్రెంటిస్ పీరియడ్ చేసి సర్వీస్ చేసినందుకు రెండు నోషనల్ ఇంక్రిమెంట్లు ఇచ్చారన్నారు. ఆయన తనయుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఉపాధ్యాయ పక్షపాతిగా వ్యవహరించారన్నారు. తెలుగు, హిందీ, వ్యాయామ ఉపాధ్యాయుల పోస్టులను అప్‌గ్రేడ్ చేశారన్నారు. ఈ కారణంగా దాదాపు 30 వేల మంది టీచర్లు ప్రమోషన్లు పొందారన్నారు. నాడు–నేడు కార్యక్రమం ద్వారా ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్ స్థాయిలో మార్చారన్నారు. జగన్‌మోహన్‌రెడ్డి అధికారంలోకి వచ్చిన వెంటనే 27 శాతం ఐఆర్ ఇచ్చారని గుర్తు చేశారు. ఇప్పుడున్న ప్రభుత్వం ఎన్నికల హామీలను తొమ్మిది నెలలు పూర్తవుతున్నా పట్టించుకోలేదన్నారు. పీఎఫ్, ఏపీజీఎల్‌ఐ లోన్లు, క్లెయిమ్స్, ఆర్జిత సెలవుల బకాయిలు ఇంతవరకు చెల్లించలేదన్నారు. 12వ పీఆర్సీ కమిషన్ వేయలేదన్నారు. వెంటనే ఉద్యోగ, ఉపాధ్యాయ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. వైఎస్సార్‌టీఏ గుర్తింపుకు కృషి చేసిన ఉపాధ్యాయ ఎమ్మెల్సీలు కల్పలత రెడ్డి, ఎంవీ రామచంద్రారెడ్డి, చంద్రశేఖర్‌రెడ్డి, రాష్ట్ర అధ్యక్షులు అధ్యక్షుడు అశోక్ కుమార్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి సుధీర్‌కు జిల్లా శాఖ కృతజ్ఞతలు తెలిపింది. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు నాగిరెడ్డి, ప్రధాన కార్యదర్శి శ్రీధర్, రాష్ట్ర నాయకులు గోవిందరెడ్డి, రాధాకృష్ణారెడ్డి, వెంకటరమణ, గోపాల్, రామకృష్ణ, జిల్లా నాయకులు ఓబిరెడ్డి, కేశవరెడ్డి వెంకటరెడ్డి పాల్గొన్నారు.
వైఎస్సార్‌టీఏ రాష్ట్ర అధ్యక్షుడు పి.అశోక్‌కుమార్‌రెడ్డి
Comments
Please login to add a commentAdd a comment