వైఎస్సార్‌సీపీ కార్యకర్తలపై హత్యాయత్నం
చిలమత్తూరు: హిందూపురం రూరల్ మండలం జంగాలపల్లిలో వైఎస్సార్‌సీపీ కార్యాకర్తలపై టీడీపీ కార్యకర్తలు హత్యాయత్నం చేశారు. గురువారం రాత్రి బాలంపల్లి వైపు నుంచి వస్తున్న అశ్వర్థ, దేవేగౌడలపై మార్గ మధ్యంలో కాపుకాచిన టీడీపీ కార్యకర్తలు సాయికుమార్, శ్రీనివాసులు, గోవిందప్ప మారణాయుధాలతో విచక్షణా రహితంగా దాడి చేశారు. తీవ్రంగా గాయపడిన వారిని స్థానికులు వెంటనే హిందూపురం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. విషయం తెలుసుకున్న వైఎస్సార్‌సీపీ నేత వేణురెడ్డి శుక్రవారం హిందూపురం జిల్లా సర్వజనాస్పత్రికి చేరుకుని బాధితులను పరామర్శించారు. అన్ని విధాలుగా అండగా ఉంటామని భరోసా కల్పించారు. నియోజకవర్గ సమన్వయకర్త టీఎన్ దీపిక ఫోన్ ద్వారా బాధితులను పరామర్శించారు. అనంతరం వేణురెడ్డి మాట్లాడుతూ నియోజకవర్గంలో వైఎస్సార్‌సీపీ శ్రేణులే లక్ష్యంగా దాడులు చేస్తున్నారన్నారు. ఎమ్మెల్యే బాలకృష్ణ టీడీపీ నేతల అరాచాకాలను ప్రోత్సహిస్తున్నట్లు అనిపిస్తోందన్నారు. పోలీసులు నిందితులను అరెస్ట్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఇదిలా ఉండగా వ్యక్తిగత కక్షలే దాడులకు కారణమని, ఇరుపక్షాలపై కేసు నమోదు చేయనున్నట్లు సీఐ ఆంజనేయులు ప్రకటించారు.
నిందితులు టీడీపీ కార్యకర్తలు
Comments
Please login to add a commentAdd a comment