
రక్తదానంతో మరొకరికి పునర్జన్మ
ఎస్‌ఆర్‌ఐటీ కళాశాల చైర్‌పర్సన్ జొన్నలగడ్డ పద్మావతి, కరస్పాండెంట్ ఆలూరి సాంబశివారెడ్డి
బుక్కరాయసముద్రం: రక్తదానం చేస్తే ఆపదలో ఉన్నవారికి పునర్జన్మను ఇచ్చినట్లు అవుతుందని ఎస్‌ఆర్‌ఐటీ కళాశాల చైర్‌పర్సన్, మాజీ ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి, కరెస్పాండెంట్ ఆలూరి సాంబశివారెడ్డి అన్నారు. ఆలూరి సాంబశివారెడ్డి తల్లి ఆలూరి నారాయణమ్మ 18వ వర్ధంతి సందర్భంగా మంగళవారం బీకేఎస్ మండలం రోటరీపురం వద్ద ఉన్న ఎస్‌ఆర్‌ఐటీ కళాశాల ఎన్‌ఎస్‌ఎస్ విభాగం ఆధ్వర్యంలో అనంతపురం జీజీహెచ్, మానవతా స్వచ్ఛంద సంస్థ నేతృత్వంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. అంతకు ముందు ఆలూరి నారాయణమ్మ చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం సిబ్బందికి నూతన దుస్తులను జొన్నలగడ్డ పద్మావతి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... రక్తదానం చేయడాన్ని ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా గుర్తించాలన్నారు. అనంతరం కళాశాలలో సేకరించిన 102 యూనిట్ల రక్తాన్ని ప్రభుత్వ సిబ్బందికి అందజేశారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ బాలకృష్ణ, వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ శ్రీనివాస్, టీపీఓ రంజిత్‌రెడ్డి, మానవతా బ్లడ్ బ్యాంక్ కన్వీనర్ తరిమెల అమర్‌నాథ్‌రెడ్డి, విద్యార్థులు పాల్గొన్నారు.

రక్తదానంతో మరొకరికి పునర్జన్మ