
కొనలేక ‘కంది’పోతున్నారు!
అనంతపురం అర్బన్: చంద్రబాబు సర్కారు పేదలకు చుక్కలు చూపుతోంది. గత ప్రభుత్వంలో అమలైన ఇంటింటికీ రేషన్ పంపిణీ పక్కన పెట్టేసి కష్టాలు తెచ్చిపెట్టింది. పనులు వదులుకుని గంటల తరబడి రేషన్‌దుకాణాల వద్ద పడిగాపులు కాయిస్తోంది. ఈ క్రమంలోనే నిత్యావసర సరుకుల్లోనూ కోత పెడుతూ భారం మోపుతోంది. మూడు నెలలుగా జిల్లాకు కందిపప్పు సరఫరా చేయకపోవడమే ఇందుకు నిదర్శనం. జిల్లాలోని 6.60 లక్షల కార్డుదారులకు కేవలం బియ్యం, చక్కెర పంపిణీతో సరిపెడుతున్నారు. కందిపప్పు ఎందుకివ్వడం లేదంటూ డీలర్లను కార్డుదారులు అడిగితే ‘ప్రభుత్వం నుంచి రాలేదు...మేమేం చెయ్యాలి’ అంటూ సమాధానమిస్తున్నారు.
రూ. 12.48 కోట్ల భారం
రేషన్ దుకాణాల ద్వారా కిలో కందిపప్పు రూ.67తో కార్డుదారులకు అందించేవారు. మూడు నెలలుగా ప్రభుత్వం పంపిణీ చేయకపోవడంతో బయటి మార్కెట్‌లో కొనాల్సి వస్తోంది. ప్రస్తుతం మార్కెట్‌లో కిలో కందిపప్పు రూ.130గా ఉంది. ప్రభుత్వ ధరతో పోలిస్తే కిలోపై అదనంగా రూ.63 పడుతున్నా కొనక తప్పడం లేదు. ఈ లెక్కన జిల్లాలో కార్డుదారులపై నెలకు రూ.4.16 కోట్ల చొప్పున మూడు నెలల్లో రూ.12.48 కోట్ల అదనపు భారం పడినట్లయింది.
జిల్లాకు కందిప్పు అలాట్‌మెంట్
625 టన్నులు
6,60,330
బియ్యం కార్డులు
మూడు నెలలుగా రేషన్ దుకాణాలకు అందని కందిపప్పు
6.60 లక్షల మంది
కార్డుదారులకు మొండిచెయ్యి
పేదలపై భారం మోపిన బాబు సర్కారు

కొనలేక ‘కంది’పోతున్నారు!