
ప్రాణాలు బలిగొన్న ఈత సరదా
పెద్దవడుగూరు: మండలంలోని దిమ్మగుడి గ్రామానికి చెందిన హరినాథ్‌రెడ్డి (15) గురువారం ఈత కొట్టేందుకు వెళ్లి నీట మునిగి మృతి చెందాడు. తల్లిదండ్రులు వలస కూలీలు కావడంతో డ్రాపౌట్‌గా మారాడు. ఈ క్రమంలో గురువారం ఉదయం తన స్నేహితులతో కలసి సి.రామరాజుపల్లి వద్ద ఉన్న నీటి కుంటలో ఈత కొట్టేందుకు వెళ్లాడు. తనకు ఈత రాకున్నా.. ప్రయత్నిస్తూ లోతైన ప్రాంతానికి వెళ్లడంతో నీట మునిగిపోయాడు. సమాచారం అందుకున్న గ్రామస్తులు అక్కడకు చేరుకుని గజ ఈతగాళ్ల రంగంలో దించడంతో సుదీర్ఘ సమయం అనంతరం హరినాథ్‌రెడ్డి మృతదేహం బయటపడింది. హైదరాబాద్‌లో ఉంటున్న తల్లిదండ్రులకు ఫోన్ ద్వారా గ్రామస్తులు సమాచారం అందించారు. ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు.
నీట మునిగి విద్యార్థి మృతి
కళ్యాణదుర్గం రూరల్: ఈత సరదా ఓ విద్యార్థి ప్రాణాలు బలిగొంది. పోలీసులు తెలిపిన మేరకు.. కళ్యాణదుర్గంలోని వడ్డేబండ వీధికి చెందిన గోవిందప్ప, లలితమ్మ దంపతులకు ఇద్దరు కుమారులు ఉన్నారు. కూలి పనులతో కుటుంబాన్ని పోషించుకునేవారు. వీరి రెండో కుమారుడు సంజయ్ (13) స్థానిక నార్త్ స్కూల్‌లో ఏడో తరగతి చదువుతున్నాడు. గురువారం మధ్యాహ్నం స్నేహితులతో కలసి ఊరి చెరువులోకి ఈతకెళ్లిన సంజయ్.. కాసేపు సరదాగా నీటిలో ఆడుకుంటూ లోతైన ప్రాంతానికి వెళ్లడంతో నీట మునిగాడు. గమనించిన స్థానికులు వెంటనే సంజయ్‌ను వెలికి తీశారు. అప్పటికే అపస్మారక స్థితికి చేరుకోవడంతో హుటాహుటిన స్థానిక సీహెచ్‌సీకి తీసుకెళ్లారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే బాలుడు మృతి చెందినట్లు నిర్ధారించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.

ప్రాణాలు బలిగొన్న ఈత సరదా