
సమాజంలోని అసమానతలను, బాల్య వివాహాలను రూపు మాపేందుకు సీ్
గాండ్లపెంట: వేమన చరిత్ర కదిపితే ఎన్నో కథలు అలలు అలలుగా పలకరిస్తాయి. ఆయన కులంపై ఎన్నో వాదనలు ఉన్నా.. ఎన్నిసార్లు చరిత్రను తిరగేసినా వేమన ‘రెడ్డి’ కులస్తుడనే స్పష్టమైంది. ఈస్ట్ ఇండియా కంపెనీకి చెందిన బ్రిటిష్ అధికారి సీపీ బ్రౌన్ ద్వారా 1839లో వేమన పద్యాలు తొలిసారిగా పుస్తక రూపంలో వెలుగులోకి వచ్చాయి.
ప్రజాచైతన్య బావుటా
సామాజిక వైజ్ఞానిక నేత్రాలతో సమాజాన్ని దర్శించిన వేమన... కుట్రలను, కుతంత్రాలను రూపు మాపడానికి తనదైన సాహిత్యంతో ప్రజల్లో విస్తృత చైతన్యం తీసుకువచ్చారు. ఈ సందర్భంగా ఆయన సంధించిన వ్యంగ్యాస్త్రాలు ఎప్పటికీ నిత్యనూతనంగానే నిలిచాయి. ఇందులో మచ్చుకు కొన్ని...
వేషభాష లెరిగి కాషయవస్త్రముల్
గట్టగానె ముక్తి గలుగబోదు
తలలు బోడులైన తలపులూ బోడులా
విశ్వదాభిరామ వినురవేమ!
అర్థం: ‘వేషభాషలు నేర్చుకుని, కాషాయ వస్త్రములు ధరించినంత మాత్రాన మోక్షము రాదు, గుండు గీయించుకున్నమాత్రాన దురాలోచనలు దూరం కావు’ అంటూ అలాంటి వ్యక్తుల వైఖరిపై వేమన వ్యంగ్యాస్త్రం సంధించారు.
● మరో పద్యంలో వ్యక్తుల ఎదుట ఒకరీతిన... మనసులో మరోరీతిన వ్యవహరించేవారి వైఖరిని ఎండగడుతూ..
మాటలాడు నొకటి మనసులోన నొకటి
ఒడలి గుణము వేరె యోచన వేరె
ఎట్లుగల్గు ముక్తి యీలగు తానుండ
విశ్వదాభిరామ వినురమేమ
అర్థం: ‘మనస్సులో ఒకటి ఉంచుకునే పైకి మరోలా మాట్లాడే వ్యక్తి గుణమొకటి... యోచన వేరొకటిగా ఉంటుంది. ఇట్టి వారికి మోక్షము ఎట్లా కలుగుతుంది’ అని ప్రశ్నించారు.
ఉత్సవాలు ఇలా...
● ఆదివారం నుంచి 4 రోజుల పాటు గాండ్లపెంట మండలం కటారుపల్లిలో విశ్వకవి యోగివేమన ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఉదయం మహాశక్తిపూజ (కుంభం పోయుట), మధ్యాహ్నం నుంచి రాత్రి 1 గంట వరకు శాసీ్త్రయ నృత్య ప్రదర్శనలు ఉంటాయి.
● సోమవారం రాత్రి బండ్లు తిరుగుట, పానక పన్నేరం, రాత్రి 9 గంటలకు పాటల కచేరీ (ఆర్కెస్ట్రా) ఉంటుంది.
● మంగళవారం సాయంత్రం 4 గంటలకు ఉట్ల తిరునాల, రాత్రి 9 గంటలకు అగ్ని సేవ ఉంటాయి. అలాగే సాయంకాలం 6 నుంచి రాత్రి 8 గంటల వరకు డ్యాన్స్ అకాడమీ ఆధ్వర్యంలో నృత్య ప్రదర్శనలు ఉంటాయి.
● బుధవారం రాత్రి 9 గంటలకు గొడుగుల మేరవణితో ఉత్సవాలు ముగుస్తాయి.
ప్రత్యేక ఏర్పాట్లు..
ఉత్సవాలకు కదిరి పరిసర మండలాల నుంచే కాక ఉమ్మడి కర్నూలు, పొట్టి శ్రీరాములు నెల్లూరు, ప్రకాశం, వైఎస్సార్ జిల్లాలతో పాటు కర్ణాటక, తమిళనాడు ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలి రానున్నారు. ఈ నేపథ్యంలో భక్తుల సౌకర్యార్థం ఆలయ నిర్వాహకులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. అలాగే కదిరి నుంచి వచ్చే భక్తులు గాండ్లపెంట, రాయచోటికి వెళ్లే బస్సులు ఎక్కి కటారుపల్లి క్రాస్‌లో దిగి ఆటో లేదా నడక మార్గంలో కిలోమీటరు దూరం వెళ్లాల్సి ఉంటుంది. రాయచోటి నుంచి వచ్చే భక్తులు గాండ్లపెంట మీదుగా 4 కిలోమీటర్లు దూరంలో ఉన్న కటారుపల్లి క్రాస్‌కు చేరుకోవచ్చు.
రేపటి నుంచి 4 రోజుల పాటు యోగి వేమన ఉత్సవాలు

సమాజంలోని అసమానతలను, బాల్య వివాహాలను రూపు మాపేందుకు సీ్

సమాజంలోని అసమానతలను, బాల్య వివాహాలను రూపు మాపేందుకు సీ్