
గాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్య సాధనలో భాగంగా వైఎస్సార్
జిల్లా సమాచారం
సాక్షి ప్రతినిధి, అనంతపురం: గడిచిన ఐదేళ్లలో ప్రజలు కోరుకున్న సేవలన్నీ ఇంటి ముంగిటకే వచ్చాయి. గ్రామ/ వార్డు సచివాలయ వ్యవస్థ కారణంగా పింఛన్లు మొదలుకొని అన్ని సేవలూ సత్వరమే అందాయి. కరోనా లాంటి ఆపత్కాలంలోనూ ఈ సేవలే గట్టెక్కించాయని స్వయానా నీతి ఆయోగ్ చెప్పింది. అలాంటి ఈ వ్యవస్థను కూటమి సర్కారు బలితీసుకుంది. ఎన్నికలకు ముందు ‘సంపద సృష్టిస్తా.. మహిళలను లక్షాధికారులను చేస్తా’ అంటూ అలివికాని హామీలు ఇచ్చిన చంద్రబాబు ఇప్పుడు వాటిని గాలికొదిలేయడమే కాకుండా గడప ముందుకొచ్చే సేవలన్నిటినీ నిలిపివేశారు. పంచాయతీ కార్యాలయాల్లో పింఛన్‌కోసం పడిగాపులు కాసే పరిస్థితులకు అద్దం పట్టేలా మళ్లీ పాతరోజులు గుర్తుకొస్తున్నాయని జనం అంటున్నారు.
వ్యవస్థ నిర్వీర్యం
ప్రతి 2 వేల జనాభాకు గ్రామ లేదా వార్డు సచివాలయం ఉండేది. బర్త్ సర్టిఫికెట్ మొదలుకొని పింఛన్ వరకూ అన్నీ ఇచ్చేవారు. ఇప్పుడు ఉద్యోగులను వివిధ విభాగాలకు బదిలీ చేసి గ్రామ/ వార్డు సచివాలయ వ్యవస్థను నిర్వీర్యం చేశారు. గతంలో రోజూ వేలాదిమంది లబ్ధిదారులు సచివాలయాలకు వచ్చి తమ పనులు చేసుకునే వారు. ఇప్పుడా పరిస్థితి లేదు.
సచివాలయ సేవలకు తిలోదకాలు
ఇంటివద్దకే వచ్చి ఇచ్చే పింఛన్లకు ఎగనామం
రేషన్ డోర్ డెలివరీ నిలిపివేతతో వృద్ధులకు కష్టాలు
ఇంటింటా చెత్త సేకరించే వాహనాలూ ఆపిన సర్కారు

గాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్య సాధనలో భాగంగా వైఎస్సార్