
కేసులకు భయపడొద్దు
ప్రజల్లో వస్తున్న వ్యతిరేకతను కప్పిపుచ్చుకునేందుకు వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలపై అక్రమంగా కేసులు పెడుతున్నారు. పోలీసులను అడ్డుపెట్టుకుని మనల్ని ఇబ్బందులు పెట్టాలని చూస్తున్నారు. పోలీసుల కేసులకు ఎవరూ భయపడొద్దు. నాకు జైలు, బెయిలు కొత్తకాదు. రెండున్నరేళ్లు జైలు జీవితం గడిపా. మహా అంటే కేసులు నమోదు చేస్తారు, లేదంటే రిమాండ్‌కు పంపుతారు, అంతకంటే ఏం చేస్తారు. కార్యకర్తలెవరూ భయపడొద్దు. రాజన్న భక్తులు, జగనన్న సైనికులు 8న పాపిరెడ్డిపల్లికి తరలిరావాలి. చంద్రబాబు చేతిలో మోసపోయిన మహిళలు, నిరుద్యోగులు, రైతులు, యువకులు పెద్ద ఎత్తున వచ్చి జగనన్నకు సంఘీభావం తెలపాలి. లింగమయ్యదే చివరి రాజకీయ హత్య కావాలి. ఈ ఘటనను అన్ని రాజకీయ పార్టీలు ఖండిం చాలి. చట్టాన్ని చేతుల్లోకి తీసుకునే నేర వ్యవస్థ రాప్తాడు నియోజకవర్గంలో ఉంది. ఈ సంప్రదాయాన్ని ఇక్కడే అణిచి వేయాలి.
– తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే