
కష్టపడి చదివితే లక్ష్యాలను చేరుకోవచ్చు
● జాయింట్ కలెక్టర్ శివనారాయణ్ శర్మ
ఉరవకొండ: ప్రభుత్వ పాఠశాలల్లో చదివే తాను ఐఏఎస్ సాధించానని, ఇష్టంతో కష్టపడి చదివితే ఎలాంటి లక్ష్యాలనైనా చేరుకోవచ్చని జాయింట్ కలెక్టర్ శివనారాయణ్‌శర్మ పేర్కొన్నారు. శనివారం అనంతపురంలోని రోటరీపురం వద్ద సీసీఎల్ క్యాంపస్‌లో ఉరవకొండకు చెందిన నిస్వార్థ ఫౌండేషన్, హైదరాబాద్‌కు చెందిన అభయ ఫౌండేషన్ సంయుక్తగా అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థినీ విద్యార్థులకు ‘సూపర్–60’ పేరుతో ఏపీఆర్‌జేసీ, పాలిసెట్, ఆర్డీటీ సెట్‌కు ఉచిత కోచింగ్ ప్రారంభించాయి. జాయింట్ కలెక్టర్ హాజరై విద్యార్థులకు స్టడీ మెటీరియల్ అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రైవేట్, కార్పొరేట్ కళాశాలలు, పాఠశాలల్లో చదవితేనే ర్యాంకులు వస్తాయని అనుకోవడం భ్రమ అని, ప్రభుత్వ పాఠశాలల్లో చదివి ఐఏఎస్, ఐపీఎస్ సాధించిన వారు ఎందరో ఉన్నారని గుర్తు చేశారు. అనంతరం అభయ ఫౌండేషన్ నిర్వాహకులు స్వామి బాలచంద్ర మాట్లాడుతూ రూ.లక్షల కోసం కాకుండా లక్ష్యం కోసం చదవాలని సూచించారు. పరీక్షల కోసం మాత్రమే శిక్షణ కాదని, శారీరక, మానసిక ఆరోగ్యం కోసం ఇస్తున్నామని చెప్పారు. నిస్వార్థ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు వెంకట్ తాటికొండ మాట్లాడుతూ 2047 వికసిత్ భారత్ నిర్మాణంలో భాగంగా ఈ శిక్షణ ఇస్తున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో జైకిసాన్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు నాగమల్లి ఓబుళేసు, నిస్వార్థ ఫౌండేషన్ సభ్యులు చంద్ర, వాణి, రజినీ తదితరులు పాల్గొన్నారు.
జీసీజీటీఏ జిల్లా నూతన కార్యవర్గం
అనంతపురం ఎడ్యుకేషన్: ప్రభుత్వ జూనియర్ కళాశాలల అధ్యాపకుల సంఘం (జీసీజీటీఏ) జిల్లా నూతన కార్యవర్గాన్ని శనివారం నగరంలోని కొత్తూరు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో అధ్యాపకులు ఎన్నుకున్నారు. జిల్లా అధ్యక్షుడిగా పి.శ్రీధర్‌రెడ్డి, కార్యదర్శిగా వి.షణ్ముక ఆచారి, ఉపాధ్యక్షుడిగా వి.వీరాంజనేయులు, జాయింట్ సెక్రటరీగా జి.నారాయణస్వామి, మహిళా విభాగం కార్యదర్శిగా కె.శ్రీసుధ, స్టేట్ కౌన్సిలర్లుగా బి.బాపూజీ, పి.హనుమంతరెడ్డి ఎన్నికయ్యారు. ఎన్నికల అధికారిగా బి.మనోహర్‌రెడ్డి వ్యవహరించారు.