
ఉత్సాహంగా.. ఉల్లాసంగా..
గార్లదిన్నె: శ్రీరామనవమి సందర్భంగా గార్లదిన్నె మండలం కల్లూరులో నిర్వహించిన గ్రామీణ క్రీడాపోటీలు ఉత్సాహంగా... ఉల్లాసంగా సాగాయి. అగ్రహారం ఆంజనేయస్వామి దేవాలయం వద్ద ఆదివారం ఈ పోటీలను నిర్వహించారు. పోటీలను చూసేందుకు పెద్ద సంఖ్యలో జనం తరలివచ్చారు. 151 కిలోల ఇసుక మూట ఎత్తే పోటీల్లో పాల్తూరు రాజు మొదటి స్థానాన్ని దక్కించుకున్నాడు. రెండో స్థానంలో కల్లూరు సుధాకర్ నిలిచాడు. 146 కిలోల బరువున్న గుండును ఎత్తే పోటీల్లో మాధవరం రాజశేఖర్ మొదటి స్థానం, ప్యాపిలి మండలానికి చెందిన ఈశ్వరరెడ్డి రెండో స్థానాన్ని దక్కించుకున్నారు. 60 కిలోల బరువున బండను ఒక్క చేతితో పైకి ఎత్తే పోటీల్లో మొదటి స్థానాన్ని హుస్సేన్ దక్కించుకోగా, రెండో స్థానంలో ఈశ్వరరెడ్డి నిలిచాడు. కర్ర సాము పోటీల్లో మొదటి స్థానంలో రాజేష్, రెండో స్థానంలో యాడికి నాగార్జున గెలుపొందారు.ఇరుసు పోటీల్లో మొదటి స్థానంలో నాగులాపురం వనేంద్ర, రెండవ స్థానంలో వంకరాజుకాలువ నరేష్ నిలిచారు. విజేతలను గ్రామస్తులు అభినందించి, నగదు పురస్కారాలతో సత్కరించారు.

ఉత్సాహంగా.. ఉల్లాసంగా..

ఉత్సాహంగా.. ఉల్లాసంగా..

ఉత్సాహంగా.. ఉల్లాసంగా..

ఉత్సాహంగా.. ఉల్లాసంగా..