
పొలాల్లో రేషన్ బియ్యం డంప్
పామిడి: మండలంలోని తంబళ్లపల్లి గ్రామ పొలాల్లో కొందరు అక్రమార్కులు పెద్ద ఎత్తున రేషన్ బియ్యాన్ని డంప్ చేశారు. పేదల ఆకలి తీర్చాల్సిన బియ్యాన్ని కొందరు యథేచ్ఛగా నల్లబజారులో అధిక ధరతో విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో తంబళ్లపల్లి గ్రామంలోని పాత గంగమ్మ గుడి సమీపంలోని పొలాల్లో సోమవారం నాటికి 70 బస్తాల బియ్యాన్ని కొందరు గుట్టు చప్పుడు కాకుండా డంప్ చేశారు. కొన్ని రోజులుగా ఆటోలో బియ్యాన్ని తీసుకువచ్చి అక్కడ డంప్ చేస్తున్నట్లుగా ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.