
రైతులకు పరిహారం అందించాలి
రాయదుర్గం నియోజకవర్గంలో కురిసిన వడగండ్ల వర్షం, ఈదురుగాలుల బీభత్సానికి పంటలు నష్టపోయిన రైతులకు ప్రభుత్వ పరిహారం అందించి ఆదుకోవాలి. బొమ్మనహాళ్, కణేకల్లు మండలాల్లో చేతికొచ్చిన వరి పంట నేలపాలు కావడం బాధాకరం. రాయదుర్గం, గుమ్మఘట్ట, డీ హీరేహాళ్ మండలాల్లోనూ మొక్కజొన్న, ఉద్యాన పంటలు దారుణంగా దెబ్బతిన్నాయి. ప్రతి రైతుకూ న్యాయం చేకూర్చేలా కలెక్టర్‌కు విజ్ఞప్తి చేశాం.
– మెట్టు గోవిందరెడ్డి,
మాజీ ఎమ్మెల్యే, రాయదుర్గం