
బీసీల ప్రయోజనాలకు కూటమి విఘాతం
అనంతపురం కార్పొరేషన్: కూటమి ప్రభుత్వం బీసీల ప్రయోజనాలకు విఘాతం కలిగించే చర్యలు చేపడుతోందని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి మండిపడ్డారు. శుక్రవారం వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో మహాత్మ జ్యోతిరావ్ ఫూలే జయంతిని పురస్కరించుకుని ఆయన చిత్రపటానికి అనంత పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహాత్మా జ్యోతిరావ్ పూలే గొప్ప సంఘ సంస్కర్త అని కొనియాడారు. దురాచారాలను రూపుమాపేందుకు ఎన్నో పోరాటాలు చేశారన్నారు. పూలే స్ఫూర్తితో గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం విప్లవాత్మక సంస్కరణలకు శ్రీకారం చుట్టిందని గుర్తు చేశారు. బడుగు, బలహీనల వర్గాలు అన్ని విధాలా అభివృద్ధి చెందేలా చర్యలు తీసుకున్నారన్నారు. విద్యలో నూతన సంస్కరణలు తీసుకువచ్చి, పేదలకు కార్పొరేట్ స్థాయి విద్యనందించేలా చూశారన్నారు. మహిళలకు రాజకీయంగా అవకాశాలు కల్పించి, స్థానిక సంస్థల్లో, కార్పొరేషన్, మునిసిపాలిటీల్లో 50 శాతంకుపైగా రిజర్వేషన్ కల్పించిన విషయాన్ని గుర్తు చేశారు. అయితే ప్రస్తుత కూటమి ప్రభుత్వం బడుగులను నట్టేట ముంచుతోందన్నారు. ఎన్నికలకు ముందు అలివిగాని హామీలను ప్రకటించి ఇప్పుడు డైవర్షన్ పాలిటిక్స్‌తో కాలయాపన చేస్తోందన్నారు. కూటమి ప్రభుత్వం మెడలు వంచైనా బడుగులకు మేలు చేసేలా వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో ఉద్యమిస్తామన్నారు. పూలే ఆశయ సాధనకు కృషి చేస్తామన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ మంగమ్మ, జెడ్పీ చైర్‌పర్సన్ బోయ గిరిజమ్మ, మేయర్ వసీం, డిప్యూటీ మేయర్లు వాసంతి సాహిత్య, విజయభాస్కర్‌రెడ్డి, పార్టీ రాష్ట్ర కార్యదర్శి రమేష్‌గౌడ్, జిల్లా ప్రధాన కార్యదర్శి ఆలమూరు శ్రీనివాస్‌రెడ్డి, నగరాధ్యక్షుడు చింతా సోమశేఖర్‌రెడ్డి, మహిళా విభాగం రాష్ట్ర అధికార ప్రతినిధి కృష్ణవేణి, అనుబంధ సంఘాల అధ్యక్షుడు మల్లెమీద నరసింహులు, శ్రీదేవి, వైపీ బాబు, అమర్‌నాథ్‌రెడ్డి, నేతలు ఉమ్మడి మదన్‌మోహన్‌రెడ్డి, పెన్నోబులేసు, మాల్యవంతం మంజుల, మీసాల రంగన్న, పామిడి వీరాంజనేయులు, కేశవరెడ్డి, తలారి వెంకటేష్, చింతకుంట మధు, అనిల్‌కుమార్ గౌడ్, ఆసిఫ్, రాధాకృష్ణ, సాదిక్, కార్పొరేటర్లు రహంతుల్లా, రాజేశ్వరి, దుర్గాదేవి, సుమతి, తదితరులు పాల్గొన్నారు.
వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి