
జాతీయ స్థాయి రగ్బీ పోటీలకు ఎంపిక
అనంతపురం: శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం క్యాంపస్ ఇంజినీరింగ్ కళాశాలకు చెందిన ఇద్దరు విద్యార్థులు సీనియర్ నేషనల్ రగ్బీ చాంపియన్‌షిప్ పోటీలకు ఎంపికయ్యారు. అసోంలోని గౌహతిలో ఈ నెల 23 నుంచి 28వ తేదీ వరకు ఈ పోటీలు జరగనున్నాయి. ఇందులో ఇంజినీరింగ్ మూడో సంవత్సరం చదువుతున్న డి.శ్రీకాంత్ (పురుషుల జట్టు), వై.అశ్రియభాను (మహిళల జట్టు)కు ప్రాతినిధ్యం వహించనున్నారు. ఈ సందర్భంగా వారిని ఇంజినీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఆర్.రామచంద్ర, స్పోర్ట్స్ ఇన్‌చార్జి డాక్టర్ కె.శివానంద అభినందించారు.