
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఒకే రోజు 1,14,299 కరోనా నిర్ధారణ పరీక్షలు చేశారు. ఇందులో 23,920 మంది పాజిటివ్ కాగా, ఒకే రోజు 11,411 మంది రికవరీ అయ్యారు. అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 2,945 కేసులు నమోదయ్యాయి. రాష్ట్రం మొత్తమ్మీద 83 మంది మృతి చెందారు. ఇప్పటివరకు రాష్ట్రంలో 1,66,02,873 నమూనాలను పరీక్షించారు. ఇందులో 11,45,022 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. 9,93,708 మంది కోలుకోగా, 1,43,178 మంది చికిత్స పొందుతున్నారు. మృతుల సంఖ్య 8,136కు చేరింది.
Comments
Please login to add a commentAdd a comment