తిరుపతి: చిత్తూరు జిల్లా తిరుపతికి చెందిన 16 నెలల బాలుడు కరోనా వైరస్‌ను జయించాడు. తండ్రి, తల్లితో పాటు 14 రోజుల పాటు క్వారంటైన్‌లో ఉన్న ఆ బాలుడు శుక్రవారం డిశ్చార్జ్ అయ్యాడు. తిరుపతి స్విమ్స్ ఉద్యోగి అయిన బాలుడి తండ్రికి తొలుత కరోనా వైరస్ సోకగా, ఆ తర్వాత ఇంట్లో వారికి సోకింది. దాంతో వారంతా క్వారంటైన్‌లోకి వెళ్లి చికిత్స తీసుకున్నారు. కాగా, పిల్లాడు ఆరోగ్యంపై తల్లిదండ్రులు ఆందోళన చెందారు. కాగా, ఆ బాలుడు కరోనా నుంచి కోలుకోవడంతో తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ రోజు నెగటివ్ రిపోర్ట్స్ రావడంతో బాలుడితో పాటు తల్లి, తండ్రిని డిశ్చార్జ్ చేశారు. (తమ్ముడి మృతితో ఆగిన ఇద్దరక్కల గుండెలు!
Comments
Please login to add a commentAdd a comment