కడప ఎడ్యుకేషన్(వైఎస్సార్ జిల్లా): ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం అమలు చేస్తున్న విద్యాసంస్కరణలు సత్ఫలితాలు ఇస్తున్నాయి. ఇప్పటికే ప్రాథమిక స్థాయి నుంచి ఉన్నత స్థాయి వరకు చదివే విద్యార్థుల కోసం అమ్మఒడి, విద్యాదీవెన, వసతిదీవెన, ఫీజు రీయింబర్స్‌మెంట్ వంటి పథకాలతో విద్యను వెనకబడిన వర్గాల దరికి చేర్చిన ప్రభుత్వం ప్రైవేటు, కార్పొరేట్ స్కూళ్లలో పేద విద్యార్థులకు 25 శాతం సీట్లు ఉచితంగా ఇవ్వాలన్న నిబంధనను విధించింది. జిల్లాలో ఈ జోఓను అమలు చేసి 64 మందికి అవకాశం కల్పించారు. ఇలా ప్రవేశం పొందిన వారికి పాఠ్యపుస్తకాలు, నోట్‌పుస్తకాలు, యూనిఫాం, బూట్లతో పాటు జగనన్న విద్యాకానుక సైతం అందిస్తోంది. పేరున్న పాఠశాలల్లో చదువుకోవాలనే పేదవారి కలను నిజం చేస్తోంది.
ఈ విద్యా సంవత్సరం నుంచి అమలు...
విద్యాశాఖ 2022–23 విద్యా సంవత్సరంలో అర్హులైన పేద విద్యార్థులను ఎంపిక చేసి ప్రైవేటు పాఠశాలలకు పంపించింది. జిల్లాలో 796 కార్పొరేట్, ప్రైవేటు పాఠశాలలు ఉన్నాయి. వీటిలో 1వ తగరతిలో ప్రవేశానికి అవకాశం కల్పించింది ప్రభుత్వం. విద్యార్థుల ఎంపిక పక్రియను ఆన్‌లైన్‌లోనే పారదర్శకంగా నిర్వహించింది. జిల్లాలో 123 మంది ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో 86 మందిని ఎంపిక చేయగా 64 మందికి వివిధ పాఠశాలల్లో అడ్మిషనను కల్పించారు. మిగతా 22 మందికి వివిధ కారణాలతో ప్రవేశాలు కల్పించలేదు.
మండలాల వారగా సీట్లు పొందిన వారు...
జిల్లాలో చాపాడు మండలం నుంచి 8 మంది దరఖాస్తు చేసుకోగా ఐదుగురు విద్యార్థులు పాఠశాలలో చేరారు. కలసపాడు మండంలో 17 మందికిగాను 16 మంది, కడప మండలంలో 12 మందికిగాను 8 మంది చేరారు. బిమఠంలో ఇద్దరికిగాను ఇద్దరూ చేరారు. కమాలపురంలో ఆరుగురికి గాను ఆరుగురు చేరారు. ఖాజీపేటలో ముగ్గురికిగాను ముగ్గురు చేరలేదు. కొండాపురంలో ఇద్దరికిగాను ఇద్దరూ చేశారు. మైదుకూరులో ముగ్గురికిగాను ఇద్దరు చేరారు. పెండ్లిమర్రిలో ఇద్దరికిగాను ఒకరు, ప్రొద్దుటూరు మండలంలో 9 మంది దరఖాస్తు చేసుకోగా ఏడుగురు చేరారు. పోరుమామిళ్ల, పులివెందుల్లో ఒకరికిగాను ఒకరు చేరారు. కాశినాయన మండలంలో ఒకరికగాను ఒకరు చేరలేదు. సిద్దవటంలో నలుగురికి నలుగురు. వల్లూరు, వేముల, మద్దనూరులో ఒకరికి ఒకరు చేరారు.సీకేదిన్నెలో ముగ్గురికి ముగ్గురు చేరారు. అలాగే రెండోవిడతకు సంబంధించి కడపలో ముగ్గురికి ఇద్దరు చేరగా ఒకరు వివిధ కారణాలతో చేరలేదు. ఖాజీపేటలో ఇద్దరికి ఇద్దరు, చాపాడులో ముగ్గురికి మగ్గురు పాఠశాలలో చేరలేదు.
ఉచితంగా ప్రవేశం కల్పించాలి
పేద విద్యార్థులు కార్పొరేట్ స్కూళలో చదువుకోవాలనే కలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సాకారం చేశారు. 2022–23 సంవత్సరానికి ఈ నిబంధనను అమలు చేస్తూ ఒకటో తరగతిలో 25 శాతం సీట్లు ఉచితంగా కేటాయిస్తున్నారు. పాఠశాలల యాజమాన్యాలు నిరాకరించడానికి వీల్లేదు. విద్యార్థులపై ఎటువంటి వివక్ష చూపకూడదు. అడ్మిషన్లు తిరస్కరించినా, ఫీజులు చెల్లించాలని వేధించినా నిబంధనల మేరకు చర్యలు తీసుకుంటాం.
– దేవరాజు, జిల్లా విద్యాశాఖాధికారి
Comments
Please login to add a commentAdd a comment