సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్‌లో రికార్డు స్థాయిలో కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారు. గడిచిన 24 గంటల్లో 54,463 మంది శాంపిల్స్ పరీక్షించగా.. వాటిలో 8,601 మంది కరోనా పాజిటివ్‌గా తేలారు. తాజా పరీక్షలతో ఇప్పటి వరకు రాష్ట్రంలో నిర్వహించిన కరోనా నిర్ధారణ పరీక్షల సంఖ్య 32,92,501కి చేరగా.. మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 3,58,817కి పెరిగింది. ఇప్పటి వరకు 3,368 మంది ప్రాణాలు కోల్పోయారు. గడిచిన 24 గంటల్లో వైరస్ నుంచి కోలుకుని 8,741 మంది డిశ్చార్ కాగా.. మొత్తం కోలుకున్న వారి సంఖ్య 2,68,828గా నమోదైంది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో 89,516 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ సోమవారం హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. (ఒక్కరోజే 61 వేల కేసులు, 836 మరణాలు)
Comments
Please login to add a commentAdd a comment