గ్రామ సచివాలయాల్లోనూ ఆధార్‌ సేవలు | Aadhaar services in village secretariats too here after | Sakshi
Sakshi News home page

గ్రామ సచివాలయాల్లోనూ ఆధార్‌ సేవలు

Published Wed, Jun 23 2021 3:42 AM | Last Updated on Wed, Jun 23 2021 3:42 AM

Aadhaar services in village secretariats too here after - Sakshi

సాక్షి, అమరావతి: ఆధార్‌ నమోదు, మార్పులు చేర్పులు వంటి సేవలు ఇక గ్రామ సచివాలయాల్లో కూడా అందుబాటులో ఉండనున్నాయి. ఈ సేవల్ని వచ్చేనెల రెండో వారంలో సీఎం జగన్‌మోహన్‌రెడ్డి లాంఛనంగా ప్రారంభించనున్నట్టు గ్రామ, వార్డు సచివాలయాలశాఖ కమిషనర్‌ భరత్‌గుప్తా తెలిపారు. మొదట 500 గ్రామ సచివాలయాల్లో ఈ సేవలను అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలిపారు. క్రమంగా అన్ని గ్రామ, వార్డు సచివాలయాలకు వీటిని విస్తరిస్తామన్నారు.

ఆధార్‌ సేవలు అందుబాటులోలేని 226 మండలాల్లో మొదట ప్రాధాన్యతగా ఈ సేవలను అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు తెలిపారు. వీటికి అదనంగా జిల్లాకు 20 చొప్పున గ్రామ సచివాలయాల్లోనూ ఈ సేవలు అందుబాటులోకి తెస్తున్నామన్నారు. ఆధార్‌ సేవలకు ఉన్న డిమాండ్‌ను అంచనా వేసి జిల్లాలో ఏయే గ్రామ సచివాలయాల్లో ఈ సేవలను ప్రారంభించాలన్న నిర్ణయాన్ని జాయింట్‌ కలెక్టర్లకు అప్పగించినట్లు తెలిపారు.   

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement