స్థానిక ఎన్నికలు ఇప్పట్లో నిర్వహించలేం: గౌతమ్‌రెడ్డి | Amid Covid Situation No Possibility For Local Body Elections In November | Sakshi
Sakshi News home page

స్థానిక ఎన్నికలు ఇప్పట్లో నిర్వహించలేం: గౌతమ్‌రెడ్డి

Published Fri, Oct 23 2020 2:27 PM | Last Updated on Fri, Oct 23 2020 5:38 PM

Amid Covid Situation No Possibility For Local Body Elections In November - Sakshi

సాక్షి, తాడేపల్లి: కోవిడ్‌ పరిస్థితుల నేపథ్యంలో స్థానిక సంస్థల ఎన్నికలు ఈ నవంబర్‌లో నిర్వహించే పరిస్థితి లేదని పరిశ్రమల శాఖ మంత్రి గౌతమ్‌రెడ్డి‌ అన్నారు. కోవిడ్ కొంత తగ్గినట్లు కనిపిస్తున్నా మళ్లీ వచ్చే అవకాశాలు ఉన్నాయని శాస్త్రవేత్తల అంచనా ఉందని తెలిపారు. తాడేపల్లిలో జరిగిన స్టేట్ లెవల్‌ బ్యాంకర్స్‌ సమావేశంలో పాల్గొన్న అనంతరం గౌతమ్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. నవంబర్‌ నెలలో కోవిడ్‌ కేసులు పెరగొచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. బిహార్ వంటి రాష్ట్రాల్లో జరిగే ఎన్నికలు తప్పనిసరి అని, మన దగ్గర జరిగే స్థానిక సంస్థల ఎన్నికలకు కొంత వెసులుబాటు ఉంటుందని మంత్రి పేర్కొన్నారు. కాబట్టి ఇప్పట్లో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించే పరిస్థితి లేదని స్పష్టం చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement