
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ నుంచి సివిల్ సర్వీసెస్–2021కి ఎంపికైన విజేతలు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని కలిశారు. సోమవారం తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయానికి వచ్చారు వాళ్లు. ఏపీ నుంచి సివిల్ సర్వీసులకు ఎంపికైన ఆ అభ్యర్ధులతో ముచ్చటించి, పేరుపేరునా వారిని అభినందించారు సీఎం జగన్.
ఈసారి సివిల్స్ విజేతల్లో.. నంద్యాలకు చెందిన యశ్వంత్ రెడ్డికి 15వ ర్యాంకు లభించడం విశేషం. విశాఖకు చెందిన పూసపాటి సాహిత్యకు 24వ ర్యాంకు, నర్సీపట్నంకు చెందిన మౌర్య భరద్వాజ్ కు 28, కాకినాడ అమ్మాయి కొప్పిశెట్టి కిరణ్మయికి 56, భీమవరంకు చెందిన శ్రీపూజకు 62వ ర్యాంకు, విజయవాడకు చెందిన గడ్డం సుధీర్ కుమార్ రెడ్డికి 69వ ర్యాంకు, నగరికి చెందిన మాలెంపాటి నారాయణ అమిత్ కు 70, రాజమండ్రికి చెందిన తరుణ్ పట్నాయక్ కు 99వ ర్యాంకు వచ్చాయి.
క్యాంప్ కార్యాలయంలో సీఎం శ్రీ వైయస్.జగన్‌ను కలిసిన ఆంధ్రప్రదేశ్ నుంచి సివిల్ సర్వీసెస్–2021 కి ఎంపికైన అభ్యర్ధులు. వారిని అభినందించిన ముఖ్యమంత్రి. pic.twitter.com/UpWuCHkgKp
— CMO Andhra Pradesh (@AndhraPradeshCM) June 13, 2022
Comments
Please login to add a commentAdd a comment