మాట్లాడుతున్న రాజశేఖర్
గుంటూరు ఎడ్యుకేషన్: విద్యారంగంలో రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన సంస్కరణలు ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచాయని పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుడితి రాజశేఖర్ చెప్పారు. నాడు–నేడు, విద్యాప్రగతి, జాతీయ నూతన విద్యావిధానం (ఎన్‌ఈపీ)లో భాగంగా స్కూల్ మ్యాపింగ్‌పై గుంటూరులోని పాటిబండ్ల సీతారామయ్య ఉన్నత పాఠశాలలో మంగళవారం పాఠశాల విద్యాశాఖ రాష్ట్రస్థాయి వర్క్‌షాప్ నిర్వహించింది.
అన్ని జిల్లాల డీఈవోలు, ఆర్జేడీలు, విద్యాశాఖ అదనపు డైరెక్టర్లు పాల్గొన్న ఈ వర్క్‌షాప్‌లో రాజశేఖర్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిషు మీడియం, అమ్మఒడి, జగనన్న విద్యాకానుక, గోరుముద్ద కార్యక్రమాలను తమ రాష్ట్రాల్లో అమలు చేసేందుకు సాధ్యాసాధ్యాలపై వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు యోచిస్తున్నాయని, ప్రైవేటు ఏజెన్సీలు సర్వేలు చేస్తున్నాయని తెలిపారు.
పాఠశాలలను అన్ని విధాల పటిష్టవంతం చేసేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న విధానపరమైన నిర్ణయాలను ఉపాధ్యాయ సంఘాలు ఏకపక్షంగా వ్యతిరేకించడం తగదన్నారు. పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ఎస్.సురేష్‌కుమార్ మాట్లాడుతూ నాడు–నేడు, అమ్మఒడి, విద్యాకానుక వంటి కార్యక్రమాలతో ఒక్క ఏడాదిలోనే రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఏడులక్షల మంది విద్యార్థులు చేరారని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment