
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్‌లోరికార్డు స్థాయిలో కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు జరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 70,993 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా వీరిలో 10,601 మందికి పాజిటివ్‌గా తేలింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 5,17,094కు చేరింది. కొత్తగా 73 మంది మరణించగా మొత్తం ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 4,560కు చేరింది. సోమవారం 11,691 మంది కరోనా నుంచి కోలుకోని డిశ్చార్జ్ అయ్యారు. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. (మాల్స్ తెరచినప్పుడు కోర్టులు తెరవడం తప్పా?)
ఇప్పటి వరకు ఏపీలో 4,15,765 మంది కోలుకున్నారు. ప్రస్తుతం 96,769 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇప్పటి వరకు 42,37,070 కోవిడ్ టెస్టులు చేశారు. కరోనా కారణంగా నిన్న గుంటూరులో 10 మంది, అనంతపూర్‌లో 8, చిత్తూరులో 8, కడపలో 7, ప్రకాశంలో 7, నెల్లూరులో 6, విశాఖపట్నంలో 6, తూర్పుగోదావరిలో 5, కృష్ణా5, పశ్చిమగోదావరిలో 5, శ్రీకాకుళంలో 3, కర్నూలులో 2,విజయనగంలో 1 చొప్పున మరణించారు. (డబ్ల్యూహెచ్ఓ చీఫ్ హెచ్చరిక : ఆనంద్ మహీంద్ర రియాక్షన్)
Comments
Please login to add a commentAdd a comment