
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్ ఉదృతి కొనసాగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 56,490 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా కొత్తగా 10,004 పాజిటివ్ కేసులు వెలుగు చూశాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 4,34,771కు చేరింది. నిన్న ఒక్క రోజు రాష్ట్రంలో 85 మంది మృత్యువాత పడ్డారు. వీరిలో నెల్లూరులో పన్నెండు, చిత్తూరులో తొమ్మిది, ప్రకాశంలో తొమ్మిది, కడపలో ఎనిమిది, అనంతపురంలో ఏడుగురు, తూర్పు గోదావరిలో ఏడుగురు, గుంటూరులో ఏడుగురు, పశ్చిమ గోదావరిలో ఏడుగురు,కర్నూలులో ఆరుగురు, విశాఖపట్నంలో ఆరుగురు, శ్రీకాకుళంలో నలుగురు, కృష్ణాలో ఇద్దరు, విజయనగరంలో ఒక్కరు చొప్పున మరణించారు. (కరోనా కట్టడికి ‘స్కిప్పింగ్’ ఓ ఆయుధం)
మొత్తం కరోనాతో మరణించిన వారి సంఖ్య 3969కు చేరింది. ఆదివారం 8,772 మంది కోలుకొని డిశ్చార్జి అయ్యారు. ఇప్పటివరకు కోలుకున్నవారి మొత్తం సంఖ్య 3,30,526 అయ్యింది. కాగా రాష్ట్రంలో మొత్తం 37,22,912 పరీక్షలు పూర్తి చేశారు. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ సోమవారం హెల్త్ బులెటిన్ విడుదల చేసింది.
Comments
Please login to add a commentAdd a comment