
సాక్షి, వైఎస్సార్ జిల్లా: అన్నమాచార్య ప్రాజెక్టు వ్యవస్థాపక సంచాలకులు కామిశెట్టి శ్రీనివాసులు శనివారం కన్నుమూశారు. కడప జిల్లాకు చెందిన డాక్టర్ కామిశెట్టి శ్రీనివాసులు, అన్నమాచార్య కీర్తనలపై విశేష పరిశోధనలు చేశారు. టీటీడీ అన్నమాచార్య ప్రాజెక్టు తొలి సంచాలకులుగా కామిశెట్టి పని చేశారు. ఎస్వీ రికార్డింగ్ ప్రాజెక్ట్ తొలి డైరెక్టర్‌గా కూడా కామిశెట్టి సేవలంధించారు. ఎమ్మెస్ సుబ్బలక్ష్మి గారితో శ్రీ వెంకటేశ్వర పంచరత్న మాలికను కామిశెట్టి శ్రీనివాసులు రూపొందించారు. మరోవైపు అమెరికాలో అన్నమయ్య కీర్తనలకు విశేష ప్రాచుర్యాన్ని కల్పించడంలో కామిశెట్టి శ్రీనివాసులు ఎంతో కృషి చేశారు.
Comments
Please login to add a commentAdd a comment