మం‍డలిలో టీడీపీ అడ్డగోలు వాదన.. చైర్మన్‌ అసహనం | AP Assembly Session Updates On Feb 25th | Sakshi
Sakshi News home page

మం‍డలిలో టీడీపీ అడ్డగోలు వాదన.. చైర్మన్‌ అసహనం

Feb 25 2026 10:25 AM | Updated on Feb 25 2026 1:36 PM

AP Assembly Session Updates On Feb 25th

ఏపీ శాసన మండలి అప్‌డేట్స్‌..

ఎమ్మెల్సీ కల్పలతారెడ్డి కామెంట్స్‌..

  • అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబు పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారు. 
  • జగన్ హిందూ వ్యతిరేకి అని అవాస్తవాలు మాట్లాడుతున్నారు
  • వైవీ సుబ్బారెడ్డి సతీమణి గురించి చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నాం
  • సుబ్బారెడ్డి సతీమణి స్వర్ణమ్మ గురించి మీకు ఏం తెలుసని ప్రశ్నిస్తున్నా
  • బైబిల్ పట్టుకున్నంత మాత్రాన స్వర్ణమ్మ క్రిస్టియన్ అయిపోతుందా?.
  • మీరు కూడా అనేక సార్లు మీ మీటింగ్‌లలో బైబిల్ పట్టుకున్నారు
  • మీరు కూడా క్రిస్టియన్లే అని ఒప్పుకుంటారా?
  • మీ రాజకీయాల కోసం ఇంట్లో ఉన్న మహిళలను బయటికి తేవడం మంచి పద్ధతి కాదు
  • చంద్రబాబు కూల్చిన గుళ్లను పునఃనిర్మించిన చరిత్ర వైఎస్‌ జగన్‌ది.
  • శ్రీవాణి ట్రస్ట్ ద్వారా ఆలయాలను నిర్మించారు
  • 801 ఆలయాలను పునఃరుద్ధరణ చేశారు
  • నవనీత సేవ కోసం గోశాలను ఏర్పాటు చేశారు  
  • వైఎస్సార్, వైఎస్‌ జగన్ హిందూ సాంప్రదాయాలను కాపాడిన వ్యక్తులు
  • 21 మందితో ధార్మిక పరిషత్ ఏర్పాటు చేసింది వైఎస్సార్.  
  • దూపదీప నైవేద్యాలకు నోచుకోని ఆలయాల అభివృద్ధికి శ్రీకారం చుట్టింది వైఎస్సార్
  • ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చలేక కూటమి నేతలు వైఎస్‌ జగన్‌పై బురద జల్లుతున్నారు
  • ఇప్పటికైనా చంద్రబాబు దేవుడిపై రాజకీయం చేయడం మానుకోవాలి


ఎమ్మెల్సీ సిపాయి సుబ్రహ్మణ్యం కామెంట్స్‌..

  • ఆరోగ్య శ్రీ రాజశేఖర్ రెడ్డి మానస పుత్రిక.
  • వైద్యానికి వైఎస్సార్, వైఎస్‌ జగన్ పెద్దపీట వేశారు
  • ఈ ప్రభుత్వం ఆరోగ్యశ్రీని నిర్వీర్యం చేసింది.
  • నెట్ వర్క్ ఆసుపత్రులకు ప్రభుత్వం బిల్లులు చెల్లించడం మానేసింది
  • బిల్లులు నిలిపివేయడం వల్ల నెట్ వర్క్ ఆసుపత్రులు ఇబ్బందుల్లో పడ్డాయి
     

శాసనమండలి మీడియా పాయింట్..

ఎమ్మెల్సీ తూమాటి మధవరావు కామెంట్స్‌.. 

  • పోర్టుల‌కు ఎంత ఖర్చు చేశారని అడిగితే పొంతన లేని సమాధానాలు చెబుతున్నారు
  • తప్పుడు సమాచారంతో సభను తప్పుదోవ పట్టిస్తున్నారు
  • గత ప్రభుత్వంలో చేసిన ఖర్చులనే ఈ ప్రభుత్వం చేసినట్లు చెబుతున్నారు
  • ప్రభుత్వం‌ మారగానే అంచనాలు, టెండర్లు ఎందుకు మార్చారని అడిగితే వివరాలు లేవంటున్నారు
  • ఆరు ఫిషింగ్ హార్బర్లు అసలు మొదలు పెడతారా లేదా?
  • పోర్టుల అనుసంధా‌నం వల్లనే రహదారులు అభివృద్ధి చెందుతున్నాయి
  • గత ప్రభుత్వంలో 50-60 శాతం పనులు చేస్తే, ఈ ప్రభుత్వంలో 5% కూడా చేయలేదు
  • రేపటిలోగా మా ప్రశ్నలకు సమాధానాలు రాకపోతే ప్రివిలేజ్ కమిటీకి ఫిర్యాదు చేస్తాం

 

సమాధానం చెప్పలేక టీడీపీ అడ్డగోలు వాదన..

  • ఆడబిడ్డ నిధిపై మండలిలో టీడీపీ అడ్డగోలు వాదన
  • ఆడబిడ్డ నిధిపై సమాధానం చెప్పకుండా వైఎస్సార్‌సీపీ సభ్యులపై మంత్రుల ఎదురుదాడికి
  • మంత్రులు కొండపల్లి శ్రీనివాస్, కొలుసు పార్ధసారథి, కూటమి ఎమ్మెల్సీలు అత్యుత్సాహం
  • కూటమి ఎమ్మెల్సీల తీరుపై అసహనం వ్యక్తం చేసిన మండలి చైర్మన్
  • ఆడబిడ్డ నిధి పథకంపై మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పొంతనలేని సమాధానం
  • మంత్రి సమాధానంపై అసహనం వ్యక్తం చేసిన వైఎస్సార​్‌సీపీ సభ్యులు
  • ఆడబిడ్డ నిధి గురించి కాకుండా మిగిలిన అంశాలపై మాట్లాడిన మంత్రి
  • సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పాలని మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌కు సూచించిన చైర్మన్

 

ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి కామెంట్స్‌..

  • ఆడబిడ్డ నిధి పథకం ఎన్నికల్లో ఇచ్చిన ప్రధాన హామీ
  • 18 ఏళ్లు నిండిన ప్రతీ మహిళకు నెలకు 1500 ఇస్తామని చెప్పారు
  • నీకు 18 వేలు నీకు 18 వేలు ఇస్తామని ఇంటింటికి తిరిగి చెప్పారు
  • ఎన్నికల్లో తిరిగి మరీ ప్రచారం చేశారు
  • మూడు బడ్జెట్లు పెట్టినా ఆడబిడ్డ నిధి ఊసేలేదు

 

వాటర్ పైప్ లైన్లుపై దృష్టి పెట్టాలి: బొత్స

  • శాసనమండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ కామెంట్స్‌..
  • వాటర్ ట్యాంకుల నిర్వహణ లోపం వల్లే డయేరియా వ్యాప్తి.  
  • ప్రభుత్వం వాటర్ పైప్ లైన్లు, ట్యాంకుల నిర్వహణపై దృష్టిపెట్టాలి.

 

బాబుకి భోగాపురానికి సంబంధమే లేదు.. 

  • ఎమ్మెల్సీ సూర్యనారాయణరాజు కామెంట్స్‌..
  • భోగాపురం ఎయిర్ పోర్టుకి చంద్రబాబు టెంకాయ కొట్టి వదిలేశారు
  • 377 ఎకరాలు మాత్రమే భూ సేకరణ చేసి వదిలేశారు  
  • కోర్టు కేసులు క్లియర్ చేయలేదు
  • ఎన్ఓసీ తీసుకురాలేదు
  • వైఎస్‌ జగన్‌ సీఎం అయ్యాకే భోగాపురం ఎయిర్ పోర్టు పనులు పరుగులు పెట్టించారు
  • అన్ని అనుమతులు తెచ్చింది జగన్
  • కేంద్రంతో మాట్లాడి బీచ్ కారిడార్ అభివృద్ధికి ఆరు వేల కోట్లు తెచ్చారు
  • ఈ ప్రభుత్వం వచ్చి 20 నెలలు పూర్తైనా ఎయిర్ పోర్టు రోడ్ల అనుసంధాన ప్రక్రియ ప్రారంభించలేదు. 

నేడు మండలిలో ప్రారంభమైన సమావేశాలు

  • ప్రశ్నోత్తరాలు ప్రారంభం
  • నేడు వ్యవసాయంపై లఘు చర్చ

శాసనమండలి..

వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ మొండితోక అరుణ్ కుమార్ కామెంట్స్‌..

  • డయేరియాపై ప్రభుత్వం సరైన చర్యలు తీసుకోవడం లేదు
  • గతంలో జగ్గయ్యపేట, తురకపాలెం, విజయవాడ, ఇప్పుడు శ్రీకాకుళంలో డయేరియా విజృంభించింది
  • తురకపాలెంలో ప్రజలు ఈ నీళ్లు మేం తాగలేమని చెప్పినా ప్రభుత్వం పట్టించుకోలేదు
  • డయేరియా కట్టడికి ఈ ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుంటుందో సమాధానం చెప్పాలి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement