సాక్షి, న్యూఢిల్లీ: భౌగోళిక గుర్తింపు (జీఐట్యాగ్) పొందిన ఆంధ్రప్రదేశ్ బంగినపల్లి మామిడికాయలు దక్షిణ కొరియాకు భారీగా ఎగుమతి అవుతున్నట్లు కేంద్రం పేర్కొంది. దేశీయంగా జీఐ ట్యాగ్ పొందిన వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతులు ప్రోత్సహించే క్రమంలో కొత్త ఉత్పత్తులతో కొత్త ఎగుమతి గమ్యస్థానాలు కూడా గుర్తిస్తున్నట్లు కేంద్ర వాణిజ్య పరిశ్రమల మంత్రిత్వ శాఖ పేర్కొంది.
చదవండి: ఏపీ మీదగా ప్రత్యేక రైళ్లు.. వివరాలివే
భౌగోళిక గుర్తింపు పొందిన డార్జిలింగ్ టీ, బాస్మతి బియ్యం, నాగా మిర్చి, అస్సాం నిమ్మకాయలు, మణిపూర్ కచాయ్ లెమన్, మిజో చిల్లి, అరుణాచల్ ఆరెంజ్, మేఘాలయ ఖాసి, త్రిపుర క్వీన్ పైనాపిల్ ఉత్పత్తులు ఎగుమతి అవుతున్నాయని తెలిపింది. ఇలా పలు జీఐ ట్యాగ్ ఉత్పత్తులు పలు దేశాలకు భారీగా ఎగుమతి అవుతూ నూతన మార్కెట్లను సొంతం చేసుకుంటున్నాయని మంత్రిత్వశాఖ పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment