ఏపీలో 10 నిమిషాల్లో కరోనా ఫలితం | One Lakh Covid Rapid Test Kits Reached To Andhra Pradesh | Sakshi
Sakshi News home page

ఇకపై ఏపీలో 10 నిమిషాల్లోనే కరోనా ఫలితం..!

Published Fri, Apr 17 2020 12:18 PM | Last Updated on Fri, Apr 17 2020 5:05 PM

One Lakh Covid Rapid Test Kits Reached To Andhra Pradesh - Sakshi

సాక్షి, తాడేపల్లి: వేగవంతమైన కరోనా నిర్ధారణ పరీక్షల కోసం ఆంధ్రప్రదేశ్‌కు లక్ష కోవిడ్‌ ర్యాపిడ్‌ కిట్లను తీసుకొచ్చారు. దక్షిణ కొరియా నుంచి ప్రత్యేక చార్టర్‌ విమానంలో ఈ కిట్లను ఏపీకి తరలించారు. శుక్రవారం సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఈ టెస్ట్‌ కిట్లను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం ఆళ్ల నాని, మంత్రి బొత్స సత్యనారాయణ, సీఎస్‌ నీలం సాహ్ని, డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ పాల్గొన్నారు.  ఈ ర్యాపిడ్‌ కిట్ల ద్వారా కేవలం 10 నిమిషాల వ్యవధిలోనే కరోనా ఫలితాన్ని గుర్తించవచ్చు. కొత్తగా లక్ష ర్యాపిట్‌ కిట్లు రావడంతో ఆంధ్రప్రదేశ్‌ కరోనా పరీక్షలు మరింతగా ఊపందుకోనున్నాయి. ఇన్‌ఫెక్షన్‌ ఉందా లేదా నిర్ధారించడమే కాకుండా.. ఇన్‌ఫెక్షన్‌ వచ్చి తగ్గినా సరే ఈ కిట్లు గుర్తించున్నాయి.

కమ్యూనిటీ టెస్టింగ్‌ కోసం ర్యాపిడ్‌ కిట్లను వినియోగిస్తామని అధికారులు తెలిపారు. నాలుగైదు రోజుల్లో అన్ని జిల్లాలకు ఈ కిట్లను పంపించనున్నట్టు చెప్పారు. మరోవైపు కరోనా కట్టడి కోసం ఏపీ ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే. కరోనా పరీక్షలు నిర్వహణలో ఏపీ దేశంలో టాప్‌–5లో ఉందని రాష్ట్ర  వైద్య ఆరోగ్యశాఖ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ డా. ​​కేఎస్‌ జవహర్‌రెడ్డి అన్నారు. కాగా, ఏపీలో ఇప్పటివరకు 572 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. 

చదవండి : ఏపీలో కొత్తగా 38 కరోనా కేసులు

ఏపీ విధానాలు అనుసరణీయం

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement