
సాక్షి, తాడేపల్లి: పార్టీ కోసం, ప్రగతి కోసం అహర్నిశలు కృషి చేస్తున్న వైఎస్సార్‌సీపీ కార్యకర్తలతో నేరుగా భేటీ కావాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నిర్ణయించుకున్నారు. ఈ మేరకు ఆగష్టు 4వ తేదీ నుంచి ప్రతీ నియోజకవర్గ కార్యకర్తలతో తానే భేటీ నిర్వహిస్తానని గతంలో ప్రకటించారు కూడా.
ఇచ్చిన మాట ప్రకారం.. గురువారం(ఆగష్టు 4) తేదీ నుంచి కార్యకర్తలతో సీఎం జగన్ నేరుగా భేటీ కానున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా.. తొలుత చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గాల కార్యకర్తలతో ఆయన భేటీ సాగనుంది. మధ్యాహ్నాం సమయంలో ఈ భేటీ జరగనుంది.
ఆయా నియోజకవర్గాల్లో పార్టీ పరిస్థితులు.. పురోగతి, బలోపేతం, అభివృద్ధిని ప్రజల్లోకి ఎలా తీసుకెళ్లాలి. అదే సమయంలో ప్రత్యర్థుల నోళ్లను ఎలా మూయించాలి.. తదితర విషయాలపై సీఎం జగన్ నేరుగా కార్యకర్తలకు దిశానిర్దేశం చేయనున్నట్లు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment