సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి బుధవారం కేంద్రమంత్రి రవిశంకర్ ప్రసాద్‌కు లేఖ రాశారు. ఆన్‌లైన్ గేమింగ్, బెట్టింగ్, గ్యాంబ్లింగ్ అంశాలను ఆయన లేఖలో ప్రస్తావించారు. ఆన్‌లైన్ గ్యాంబ్లింగ్ వల్ల ఎంతో మంది ఆత్మహత్యల పాలవుతున్నారు. డబ్బు పోగొట్టుకోవడంతో పాటు దానికి తీవ్రమైన బానిసలవుతున్నారు. దీనిలో భాగంగానే ఏపీ గేమింగ్ యాక్ట్-1974ను సవరించామని తెలిపారు. ఆన్‌లైన్ గేమింగ్, బెట్టింగ్, గ్యాంబ్లింగ్‌ను నిషేధిస్తూ ఆర్డినెన్స్ తెచ్చామని పేర్కొన్నారు. ఇంటర్‌నెట్ సర్వీస్ ప్రొవైడర్లు ఆయా సైట్‌లను బ్లాక్ చేయాల్సిన అవసరం ఉందని గుర్తుచేశారు. ఇంటర్నెట్ ప్రొవైడర్లు ఏపీలో ఆయా సైట్లు, యాప్‌లను బ్లాక్ చేసేలా ఆదేశించాలని కేంద్రమంత్రి రవిశంకర్ ప్రసాద్‌ను సీఎం వైఎస్ జగన్ లేఖలో విజ్ఞప్తి చేశారు. చదవండి: ఎస్వీబీసీ చైర్మన్‌గా సాయికృష్ణ యచేంద్ర
Comments
Please login to add a commentAdd a comment