Andhra CM YS Jagan To Visit Delhi Today, Discuss Polavaram Project With Amit Shah - Sakshi
Sakshi News home page

ఢిల్లీ చేరుకున్న సీఎం వైఎస్‌ జగన్‌

Published Thu, Jun 10 2021 4:07 AM | Last Updated on Thu, Jun 10 2021 4:36 PM

AP CM YS Jagan To Visit Delhi Today - Sakshi

సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గన్నవరం ఎయిర్‌పోర్టు నుంచి బయల్దేరి ఢిల్లీ  చేరుకున్నారు. ఢిల్లీ చేరిన సీఎం జగన్‌కు ఎంపీలు విజయసాయిరెడ్డి, మోపిదేవి వెంకట రమణ స్వాగతం పలికారు. సీఎం జగన్‌ వెంట ఎంపీలు మిథున్‌రెడ్డి, అవినాష్‌రెడ్డి, బాలశౌరి, సజ్జల రామకృష్ణారెడ్డి ఉ‍న్నారు. హోంమంత్రి అమిత్‌ షా, జల వనరుల శాఖమంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్, రైల్వే శాఖ మంత్రి గోయల్‌ సహా పలువురు కేంద్ర మంత్రులతో పాటు నీతి అయోగ్‌ సీఈవో అమితాబ్‌ కాంత్‌తో కూడా సీఎం జగన్‌ భేటీ కానున్నారు. పోలవరం ప్రాజెక్ట్‌ పనులు సహా రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై వారితో చర్చిస్తారు. సీఎం వైఎస్‌ జగన్‌ తిరిగి శుక్రవారం మధ్యాహ్నం తాడేపల్లి చేరుకుంటారు.


చదవండి: YSR Bheema: స​ర్కారే పెద్ద​ దిక్కు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement