
సాక్షి, విజయవాడ : ఫ్రంట్‌లైన్ వర్కర్లకు ఏపీ ప్రభుత్వం భరోసానిచ్చింది. జూనియర్ డాక్టర్ల ఎక్స్‌గ్రేషియా డిమాండ్‌ను నెరవేర్చింది. కోవిడ్‌తో మరణించే వైద్యులు, సిబ్బందికి ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది. ఈ మేరకు వైద్య ఆరోగ్యశాఖ ముఖ్యకార్యదర్శి ఏకే సింఘాల్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. కోవిడ్ విధి నిర్వహణలో మృతి చెందిన వైద్యుని కుటుంబానికి రూ.25 లక్షలు.. స్టాఫ్ నర్సుకి రూ.20 లక్షలు, ఎఫ్‌ఎస్‌ఓ లేదా ఎమ్‌ఎస్‌ఓలకు రూ.15 లక్షల ఎక్స్‌గ్రేషియా.. ఇతర వైద్య సిబ్బంది మృతి చెందితే రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది. కేంద్ర ప్రభుత్వం చెల్లించే ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ పథకానికి అదనంగా ఈ ఎక్స్‌గ్రేషియా చెల్లించనున్నట్లు ఉత్తర్వులలో వెల్లడించింది.
తక్షణమే ఎక్స్‌గ్రేషియా అందేలా కలెక్టర్లకు అధికారం ఇచ్చింది. జిల్లా కలెక్టర్లు సంబంధిత డాక్యుమెంట్లు పరిశీలించి ఎక్స్‌గ్రేషియా ఇచ్చేలా ఆదేశాలు జారీ చేసింది. కోవిడ్ వలన మరణించారని ధ్రువీకరణ పొందిన వారందరికీ ఎక్స్‌గ్రేషియా వర్తించనుంది. ఇతర భీమా పరిహారాలు పొందినా సరే అన్నింటికీ అదనంగా ఇవ్వాలని నిర్ణయించింది.
Comments
Please login to add a commentAdd a comment