N44K Virus In AP: AP Government Clarifies On N440K Virus | ఎన్‌440కే వైరస్‌పై ఎలాంటి నిర్ధారణ జరగలేదు - Sakshi
Sakshi News home page

ఎన్‌440కే వైరస్‌పై ఎలాంటి నిర్ధారణ జరగలేదు

Published Thu, May 6 2021 2:45 PM | Last Updated on Thu, May 6 2021 4:12 PM

AP Government Clarifies On N440K Virus - Sakshi

కరోనా విపత్కర పరిస్థితుల్లో ప్రజల్ని భయబ్రాంతులకు గురి చేయొద్ధని ఏపీ స్టేట్ కోవిడ్ కమాండ్ కంట్రోల్ ఛైర్మన్‌ కేఎస్‌ జవహర్ రెడ్డి అన్నారు. ఎన్‌440కే వైరస్‌పై రాష్ట్ర వైద్యారోగ్యశాఖ స్పష్టతనిచ్చింది. రాష్ట్రంలో ఈ వైరస్‌ తీవ్రంగా ఉన్నట్టు ఎలాంటి నిర్థారణ జరగలేదని.. అందుకు సంబంధించిన పరిశోధన డేటా కూడా ఏమీలేదని ఆయన వెల్లడించారు.

సాక్షి, విజయవాడ: కరోనా విపత్కర పరిస్థితుల్లో ప్రజల్ని భయబ్రాంతులకు గురి చేయొద్దని ఏపీ స్టేట్ కోవిడ్ కమాండ్ కంట్రోల్ ఛైర్మన్‌ కేఎస్‌ జవహర్ రెడ్డి అన్నారు. ఎన్‌440కే వైరస్‌పై రాష్ట్ర వైద్యారోగ్యశాఖ స్పష్టతనిచ్చింది. రాష్ట్రంలో ఈ వైరస్‌ తీవ్రంగా ఉన్నట్టు ఎలాంటి నిర్థారణ జరగలేదని.. అందుకు సంబంధించిన పరిశోధన డేటా కూడా ఏమీలేదని ఆయన వెల్లడించారు.

‘‘ప్రతీ నెలా సీపీఎంబీకి 250 నమూనాలు పంపుతాం. ఏపీ, తెలంగాణ, కర్ణాటకల నుండి నమూనాలను జన్యు శ్రేణి పరీక్షల కోసం సీసీఎంబీ హైదరాబాద్‌కి పంపిస్తున్నారు. ఎన్ 440కె (బి.1.36) వైరస్ దక్షిణ భారత దేశం నుండి వెళ్లిన నమూనాల్లో గుర్తించారు. 2020 జున్‌, జూలై నెలల్లో ఏపీ, తెలంగాణ, కర్ణాటక నుంచి వెళ్లిన నమూనాల్లో గుర్తించారు. దాని ప్రభావం గత డిసెంబర్, ఈ ఏడాది జనవరి, ఫిబ్రవరి మాసాల్లో కనిపించింది. కానీ మార్చి నెలలో అది పూర్తిగా అంతర్థానమైంది, ఇప్పుడు దాని ప్రభావం చాలా స్వల్పం.

ప్రస్తుతం బి1.167, బి.1 వైరస్ స్ట్రెయిన్‌ల ప్రభావం దక్షిణ భారత దేశంపై ఎక్కువగా ఉంది. పాజిటివ్ కేసుల్లో ఏప్రిల్ నెల డేటాను పరిశీలించినప్పుడు నిర్థారణ జరిగింది. ఇది అధిక ఇన్ఫెక్షన్ కారకంగాను, యువతలో ఎక్కువగా వ్యాప్తి చెందుతున్నట్టు గుర్తించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏపీడేమియోలాజికల్‌లో కూడా బి.1.617ని ఇండియాలో గుర్తించినట్టు పేర్కొన్నారు. ఎన్ 440కే వేరియంట్  కోసం డబ్ల్యూహెచ్‌వో ఎక్కడా ప్రస్తావించలేదని’’ జవహర్‌రెడ్డి వివరించారు. ఓ వర్గం మీడియా ప్రచారం చేస్తున్నట్టు దీని ప్రభావం ఉంటే ఐసీఎంఆర్‌, డబ్ల్యూహెచ్‌వో గుర్తించకుండా ఎలా ఉంటుందని ఆయన ప్రశ్నించారు. మీడియాలో శాస్త్రీయమైన అంశాలపై వార్తలు ప్రసారం చేసేటప్పుడు బాధ్యతాయుతంగా ఉండాలని కేఎస్‌ జవహర్‌రెడ్డి అన్నారు.

చదవండి: ఏపీలో కొత్త రకం వైరస్ లేదు
YS Jagan: అత్యధిక పరీక్షలు, ఉచిత వైద్యం.. ప్రజలకు అండగా.. 


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement