![Ap Government Set Up SIT To Investigate Tirumala Laddu Issue](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2024/09/24/Tirumala-Laddu-Issue.jpg.webp?itok=GPuHxeH1)
సాక్షి, అమరావతి: తిరుమల లడ్డూ వివాదంపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) ఏర్పాటు చేసింది. సిట్ చీఫ్‌గా గుంటూరు రేంజ్ ఐజీ సర్వశ్రేష్ట త్రిపాఠిని ప్రభుత్వం నియమించింది. సిట్‌లో విశాఖ రేంజ్ డీఐజీ గోపీనాథ్ జెట్టి, కడప ఎస్పీ హర్షవర్దన్ రాజుతోపాటు మరికొందరు డీఎస్పీలు, సీఐలు, ఎస్‌ఐలు ఉండనున్నారు.
ఈ సిట్ బృందం శ్రీవారి ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారంపై విచారణ జరపనుంది. కాగా ఏపీ ఎన్నికల సమయంలో ఎన్నికల సమయంలో వైఎస్సార్‌సీపీ నేతలపై దాడులను ప్రోత్సహించినట్లు సర్వశ్రేష్ట త్రిపాఠిపై ఆరోపణలు ఉన్నాయి. అప్పట్లో త్రిపాఠిపై వైఎస్సార్‌సీపీ గవర్నర్‌కు ఫిర్యాదు కూడా చేసింది.
పల్నాడులో అల్లర్లు సమయంలో త్రిపాఠి గుంటూరు ఐజీగా ఉన్నారు. ఆయన ఆధ్వర్యంలో పల్నాడులో ఎన్నికల నిర్వహణ జరిగింది. ఎన్నికల సమయంలో దేశంలో ఎక్కడా లేని అల్లర్లు త్రిపాఠి హయాంలో జరిగాయని ఈసీ ఆగ్రహం కూడా వ్యక్తం చేసింది. అయితే అలాంటి వివాదాస్పద అధికారితో సిట్ ఏర్పాటుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
చదవండి: టీటీడీ లడ్డూపై పూర్తిస్థాయి విచారణ జరగాల్సిందే: అంబటి
Comments
Please login to add a commentAdd a comment