
సాక్షి, అమరావతి: భారతదేశ సాంస్కృతిక వారసత్వానికి కాశీ విశ్వనాథ్ ధామ్ ప్రతీకగా నిలుస్తుందని ఆంధ్ర ప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్ అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సోమవారం ఈ ప్రాజెక్ట్‌ను జాతికి అంకితం చేసిన నేపథ్యంలో గవర్నర్ మాట్లాడుతూ.. అద్భుతమైన కాశీ విశ్వనాథ్ ధామ్ ప్రాజెక్ట్ భారతీయుల సాంస్కృతిక చిహ్నంగా నిలుస్తుందన్నారు.
దేశీయ నాగరికతకు గుర్తింపును తెస్తుందన్నారు. దివ్య కాశీ భవ్య కాశీ ప్రాజెక్ట్ నేత్ర పర్వంగా దర్శనమిస్తూ అద్భుతమైన అనుభూతిని అందిస్తుందని గవర్నర్ బిశ్వభూషన్ హారిచందన్ పేర్కొన్నారు. ఈ మేరకు రాజ్ భవన్ నుంచి సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు.
Comments
Please login to add a commentAdd a comment