సాక్షి, కృష్ణాజిల్లా: మార్చిలో గొల్లపల్లి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించిన వారికి రాష్ట్రప్రభుత్వం ఎక్స్‌గ్రేషియా మంజూరు చేసింది. బాధిత గిరిజన కుటుంబాలకు ఆర్థిక సహాయం ఇవ్వాలని స్థానిక ఎమ్మెల్యే మెకాప్రతాప్ అప్పారావు ప్రభుత్వాన్ని కోరారు. ఎమ్మెల్యే అభ్యర్ధన మేరకు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి మృతులు 7 గురికి ఒక్కొక్కరికి రూ.5లక్షలు, తీవ్రంగా గాయపడిన 7గురికి ఒక్కొక్కరికి రూ.1లక్ష చొప్పున మొత్తం 42 లక్షల ఏక్సిగ్రేషియోను ప్రభుత్వం మంజూరు చేస్తూ జి.ఓ.జారీ చేసింది. కాగా నూజివీడు మండలం గొల్లపల్లి వద్ద మార్చి 14 న జరిగిన రోడ్డు ప్రమాదంలో సిద్దార్ధనగర్ గిరిజన కుటుంబాల సభ్యులు మృతి చెందగా, కొందరు తీవ్రంగా గాయపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment