ఏపీ వైద్య ఆరోగ్యశాఖలో 424 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ | AP Health Medical Department Notification For Assis Professor Posts | Sakshi
Sakshi News home page

ఏపీ వైద్య ఆరోగ్యశాఖలో 424 అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌

Published Tue, Jan 30 2024 4:23 PM | Last Updated on Tue, Jan 30 2024 5:53 PM

AP Health Medical Department Notification For Assis Professor Posts - Sakshi

విజయవాడ, సాక్షి: ఏపీ వైద్య ఆరోగ్యశాఖలో మరో నోటిఫికేషన్‌ జారీ అయ్యింది. డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్(DME) పరిధిలోని మెడికల్ కాలేజీలలో అసిస్టెంట్ ప్రొఫెసర్ల భర్తీకి చర్యలు చేపట్టింది. ఈ క్రమంలో మొత్తం 424 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి మంగళవారం నోటిఫికేషన్ విడుదల చేసింది మెడికల్‌ సర్వీసెస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు.

ఈ పోస్టులను డైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్‌, లేటరల్‌ ఎంట్రీ ద్వారా భర్తీ చేయన్నుట్లు బోర్డు మెంబర్ సెక్రటరీ ఎం.శ్రీనివాసరావు తెలిపారు. ‘‘సూపర్ స్పెషాలిటీలో 169, బ్రాడ్ స్పెషాలిటీలో 255 అసిస్టెంట్ ప్రొఫెసర్ల పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్‌ విడుదల చేశాం. వీటిలో 169 అసిస్టెంట్ ప్రొఫెసర్ల భర్తీకి ఫిబ్రవరి 6న  ఓల్డ్ జీజీహెచ్ , హనుమాన్ పేట , విజయవాడ డీఎంఈ కార్యాలయంలో ఉదయం 10.30 నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు వాక్‌ ఇన్‌ రిక్రూట్మెంట్ జరగనుంద’’ని ఆయన తెలిపారు. 

అలాగే.. బ్రాడ్ స్పెషాలిటీలో 255 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల కోసం ఫిబ్రవరి 1 నుండి 15వరకు ఆన్ లైన్లో దరఖాస్తు చేసుకోవాలని ఆయన కోరారు. ఈ మేరకు పూర్తి వివరాల కోసం https://dme.ap.nic.in లేదంటే.. http://apmsrb.ap.gov.in/msrb వెబ్సైట్లను పరిశీలించాలని ఏపీ మెడికల్‌ సర్వీసెస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు కోరుతోంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement