సాక్షి, అమరావతి: ప్రభుత్వ టెండర్లలో పారదర్శకత కోసం రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జ్యుడిషియల్ ప్రివ్యూ చట్టాన్ని హైకోర్టు ప్రాథమికంగా సమర్ధించింది. ఇందులో తప్పేముందని పిటిషనర్‌ను ప్రశ్నించింది. జ్యుడిషియల్ ప్రివ్యూకు, రివ్యూకు తేడా తెలుసుకోకుండా ఈ వ్యాజ్యాన్ని దాఖలు చేసినట్లు స్పష్టంగా కనిపిస్తోందని వ్యాఖ్యానించింది. ఈ వ్యాజ్యంలో లేవనెత్తిన అంశాలకు సంబంధించి గతంలో ఏవైనా తీర్పులుంటే వాటిని తమ ముందుంచాలని పిటిషనర్‌ను ఆదేశించింది. వాటిని సమర్పించడంలో విఫలమైతే.. పిటిషన్‌ను కొట్టేస్తూ ఖర్చుల చెల్లింపునకు ఆదేశాలు జారీ చేస్తామని స్పష్టం చేసింది.
తదుపరి విచారణను పది రోజులకు వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ చాగరి ప్రవీణ్‌కుమార్, జస్టిస్ దొనాడి రమేశ్‌లతో కూడిన ధర్మాసనం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వం తీసుకొచ్చిన జ్యుడిషియల్ ప్రివ్యూ చట్టం రాజ్యాంగ విరుద్ధమంటూ తిరుపతికి చెందిన వ్యాపారి విద్యాసాగర్ హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై సోమవారం న్యాయమూర్తి జస్టిస్ ప్రవీణ్‌కుమార్ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది. పిటిషనర్ తరఫున డీఎస్‌ఎన్‌వీ ప్రసాద్‌బాబు వాదనలు వినిపిస్తూ.. రాజ్యాంగంలో జ్యుడిషియల్ రివ్యూ గురించి మాత్రమే ఉంది తప్ప, జ్యుడిషియల్ ప్రివ్యూ గురించి లేదని తెలిపారు. అందువల్ల జ్యుడిషియల్ ప్రివ్యూ చట్టం రాజ్యాంగ విరుద్ధమన్నారు. అయితే ఈ వాదనలతో ధర్మాసనం విభేదించింది.
జ్యుడిషియల్ ప్రివ్యూ చట్టంలో తప్పేముంది?
Published Tue, Dec 8 2020 5:29 AM | Last Updated on Tue, Dec 8 2020 5:56 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment