
సాక్షి, అమరావతి: ఇంటర్ అడ్మిషన్లు ఆన్‌లైన్‌లోనే నిర్వహిస్తామని ఇంటర్ బోర్డు ప్రకటించింది. అడ్మిషన్లకు ఎటువంటి నోటిఫికేషన్ విడుదల చేయలేదని పేర్కొంది. కొన్ని కాలేజీలు ఆఫ్‌లైన్‌లో ఇంటర్ ఫస్టియర్ అడ్మిషన్లు చేపడుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందని.. ఆఫ్‌లైన్ అడ్మిషన్లను ఇంటర్ బోర్డు పరిగణించదని ఇంటర్ బోర్డు స్పష్టం చేసింది. ఆఫ్‌లైన్ అడ్మిషన్లు చేపట్టే ప్రైవేట్ కళాశాలలపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. విద్యార్థులు ఆన్‌లైన్ ద్వారానే అడ్మిషన్లు పొందాలని ఇంటర్ బోర్డు విజ్ఞప్తి చేసింది.
Comments
Please login to add a commentAdd a comment