
శరభన్నపాలెం సమీపంలో భర్త శివప్రసాద్‌తో కలిసి ధాన్యం ఎత్తుతున్న ఎంపీ మాధవి
సాక్షి, కొయ్యూరు (అల్లూరి సీతారామరాజు జిల్లా): అరకు ఎంపీ గొడ్డేటి మాధవి.. రైతు కుటుంబానికి చెందిన ఆమె జీవనశైలి చాలా సాధారణంగా ఉంటుంది. ఎంపీ కాకముందు కూడా ఆమె తనకు ఇష్టమైన వ్యవసాయ పనుల్లో పాల్గొనేవారు. ఇప్పుడు కూడా ఆమె తీరిక దొరికినప్పుడల్లా వ్యవసాయానికి ప్రాధాన్యమిస్తున్నారు.
ఆమె తండ్రి దివంగత మాజీ ఎమ్మెల్యే దేముడుకి వ్యవసాయ పనుల్లో సాయపడేవారు. వరి పంట చేతికందొచ్చిన వేళ ఆమె భర్త శివప్రసాద్‌తో కలిసి శుక్రవారం పొలం పనుల్లో పాల్గొన్నారు. నూర్చిన ధాన్యాన్ని వారే నేరుగా బస్తాల్లోకి వేశారు. ఎంపీ మాట్లాడుతూ చిన్నతనం నుంచి వ్యవసాయం అంటే ఇష్టమన్నారు. ఆమెతోపాటు వ్యవసాయ పనుల్లో ఎంపీ తల్లి చెల్లయమ్మ, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment