ఇరు గ్రామాల ప్రజలతో మాట్లాడుతున్న అధికారులు, ప్రజాప్రతినిధులు
చంద్రగిరి: శ్మశానం ఆక్రమణ యత్నం రెండు గ్రామాల మధ్య ఉద్రిక్తతకు దారి తీసింది. వివరాలు.. ఎగువరెడ్డివారిపల్లె గ్రామ లెక్క దాఖల సర్వే నంబరు 1లో మూడు ఎకరాల శ్మశాన వాటిక ఉంది. దాని పక్కనే ఉన్న నరసింగాపురం గ్రామస్తులు ఆ భూమిలో కత్తులు, గొడ్డలతో చెట్లు తొలగించి చదును చేసి ఆక్రమించుకోవడానికి ప్రయత్నిస్తుండగా ఎగువరెడ్డివారిపల్లె వాసులు అడ్డుకున్నారు.
దీంతో ఇరువర్గాల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న వీఆర్‌ఓ విజయ్ కుమార్, స్థానిక సర్పంచ్ రేవతి ప్రకాష్‌రెడ్డి, ఔరంగజేబు ఘటన స్థలానికి చేరుకుని ఇరు గ్రామస్తులతో చర్చించారు. అనంతరం రెడ్డివారిపల్లెకు చెందినదిగా నిర్ధారించారు. నరసింగాపురం గ్రామస్తులకు సర్ధి చెప్పి, సమస్యను పరిష్కరించారు.
Comments
Please login to add a commentAdd a comment