వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి
నెహ్రూనగర్ (గుంటూరు ఈస్ట్): మద్య విమోచన ప్రచార కమిటీ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో మత్తు పానీయాలపై కళాజాత, అవగాహన సదస్సులను ఈ నెల 13 నుంచి 16వ తేదీ వరకు తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి జిల్లాల్లోని పలు విద్యాసంస్థల్లో నిర్వహిస్తున్నట్లు కమిటీ రాష్ట్ర చైర్మన్ వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి శనివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు.
13వ తేదీన రాజమహేంద్రవరంలోని గోదావరి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, ఆదిత్య ఇంజనీరింగ్ కాలేజీలలో, 14న కాకినాడ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, శ్రీనివాస ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ కాలేజీలలో, 15న విష్ణు ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, సాగి రామకృష్ణంరాజు ఇంజనీరింగ్ కాలేజీలలో, 16న శ్రీ వాసవి ఇంజనీరింగ్ కాలేజీ, సి.ఆర్.రెడ్డి ఇంజినీరింగ్ కాలేజీలలో సదస్సులు నిర్వహించనున్నట్లు చెప్పారు. ప్రధానంగా విద్యార్థులు, యువతను డ్రగ్స్, మత్తు పానీయాలకు దూరంగా ఉంచడానికి ఈ కార్యక్రమాలు తోడ్పడతాయన్నారు. ఎక్కడైనా డ్రగ్స్, నాటుసారా, గంజాయి వంటి మత్తు పదార్థాల విక్రయాలు జరుగుతున్నట్లు తెలిస్తే 14500 టోల్ ఫ్రీ నెంబర్‌కు ఫిర్యాదు చేయాలని లక్ష్మణరెడ్డి కోరారు.
Comments
Please login to add a commentAdd a comment