
సాక్షి, తిరుపతి: ఆయుష్ ఆధ్వర్యంలో క్లినికల్ ట్రయల్స్ చేస్తున్నామని టీటీడీ ఆయుర్వేద నిపుణుల కమిటీ సభ్యురాలు రేణు దీక్షిత్ తెలిపారు. సోమవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ, ఇప్పటివరకు ఆనందయ్య కరోనా మందు తీసుకున్నవారి నుంచి రిపోర్ట్ తయారు చేస్తున్నామని ఆమె తెలిపారు. ఆనందయ్య మందు తీసుకున్నవారి సహకారం అవసరమని.. యుద్ధ ప్రాతిపదికన నివేదిక తయారు చేస్తున్నామని పేర్కొన్నారు
‘‘కంటి నుంచి డ్రాప్స్ వేయడం ఆయుర్వేదంలో ఓ ప్రక్రియ. కంటి ద్వారా వేసిన మందు త్వరగా శరీరంలో చేరుతుంది. త్వరగా పూర్తిస్థాయిలో స్టడీ చేసి వివరాలు అందిస్తాం. ఐసీఎంఆర్‌కు, ఆయుర్వేదానికి సంబంధం లేదు. కేంద్రంలో సీసీఎంఏఆర్ ఉంటుంది, వారి అనుమతి తీసుకోవాలని’’ రేణు దీక్షిత్ వివరించారు.
కంటిలో జిల్లేడిపాలు వేసుకుంటే తగ్గుతుందనేది అవాస్తవం: ఎమ్మెల్యే చెవిరెడ్డి
కంటిలో జిల్లేడిపాలు వేసుకుంటే తగ్గుతుందనేది అవాస్తవమని, ప్రజలు సంయమనం పాటించాలని టీటీడీ పాలక మండలి సభ్యుడు, చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. త్వరలో పూర్తిస్థాయిలో మందు తయారీకి టీటీడీ సిద్ధంగా ఉందని, అనుమతి లభించగానే కరోనాకు ఆయుర్వేద మందు తయారు చేస్తామని పేర్కొన్నారు. ఆయుర్వేదంలో సైడ్ ఎఫెక్ట్స్ అనేది ఏమీ ఉండదని.. ఇప్పటికే ప్రాథమికంగా ఆయుష్ అనుమతి లభించిందని భాస్కర్‌రెడ్డి తెలిపారు.
చదవండి: కరోనా చికిత్సలో అందరి చూపు ఏపీ వైపు
వ్యాక్సినేషన్ ప్రక్రియలో ఏపీ ముందడుగు
Comments
Please login to add a commentAdd a comment