'ఆలయాలు కూల్చిబాత్రూములు కట్టించిన వ్యక్తి చంద్రబాబు' | Bala Brahmananda Swamiji Fires On Chandrababu Naidu | Sakshi
Sakshi News home page

'బూట్లు వేసుకుని పూజలు చేసిన వ్యక్తి చంద్రబాబు' ..

Published Fri, Feb 5 2021 2:54 PM | Last Updated on Fri, Feb 5 2021 5:20 PM

Bala Brahmananda Swamiji Fires On Chandrababu Naidu - Sakshi

తిరుపతి : రాష్ట్రంలో మతాల మధ్య చిచ్చుపెడుతుంది చంద్రబాబేనని నైమిశారణ్యం పీఠాధిపతి బాలబ్రహ్మానంద సరస్వతి అన్నారు. తన మనుషులతో విగ్రహాల ధ్వంసానికి దిగుతున్నారని, 29 కేసుల్లో టీడీపి నేతలు ఆధారాలతో దొరకటమే ఇందుకు నిదర్శనమన్నారు. హిందూ మతంపై ఏమాత్రం ప్రేమలేని వ్యక్తి చంద్రబాబు అని, మా వాళ్లు నంది విగ్రహాన్ని తరలిస్తే తప్పేంటి అని ఆయన అనటం సిగ్గుచేటు అని ఆగ్రహం వ్యక్తం చేశారు . చంద్రబాబు మానసిక స్థితిపై అనుమానం కలుగుతోందని, ఆయన్ని వెంటనే అరెస్టు చేసి జైల్లో పెట్టకపోతే మరింతగా మతాల మధ్య గొడవలు పెడతారని పేర్కొన్నారు. (చంద్రబాబును ఏకి పారేసిన నందమూరి లక్ష్మీపార్వతి

'బూట్లు వేసుకుని పూజలు చేసిన చంద్రబాబు ఇప్పుడు హిందూ ధర్మం గురించి మాట్లాడటం సిగ్గుచేటు. విజయవాడలో ఆలయాలను కూల్చి బాత్రూములు కట్టించిన వ్యక్తి చంద్రబాబు' అని  ధ్వజమెత్తారు. సీఎం జగన్ హిందూ ఆలయాల అభివృద్ధికి కృషి చేస్తున్నారని, దుర్గగుడికి రూ.70 కోట్లు రిలీజ్ చేయటం శుభపరిణామమని పేర్కొన్నారు. చంద్రబాబు కూల్చిన గుళ్లను జగన్ కట్టించటం హర్షనీయమన్నారు. (చంద్రబాబుపై ధ్వజమెత్తిన వైఎస్సార్సీపీ ఎంపీలు)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement