Temple attack
-
'ఆలయాలు కూల్చిబాత్రూములు కట్టించిన వ్యక్తి చంద్రబాబు'
తిరుపతి : రాష్ట్రంలో మతాల మధ్య చిచ్చుపెడుతుంది చంద్రబాబేనని నైమిశారణ్యం పీఠాధిపతి బాలబ్రహ్మానంద సరస్వతి అన్నారు. తన మనుషులతో విగ్రహాల ధ్వంసానికి దిగుతున్నారని, 29 కేసుల్లో టీడీపి నేతలు ఆధారాలతో దొరకటమే ఇందుకు నిదర్శనమన్నారు. హిందూ మతంపై ఏమాత్రం ప్రేమలేని వ్యక్తి చంద్రబాబు అని, మా వాళ్లు నంది విగ్రహాన్ని తరలిస్తే తప్పేంటి అని ఆయన అనటం సిగ్గుచేటు అని ఆగ్రహం వ్యక్తం చేశారు . చంద్రబాబు మానసిక స్థితిపై అనుమానం కలుగుతోందని, ఆయన్ని వెంటనే అరెస్టు చేసి జైల్లో పెట్టకపోతే మరింతగా మతాల మధ్య గొడవలు పెడతారని పేర్కొన్నారు. (చంద్రబాబును ఏకి పారేసిన నందమూరి లక్ష్మీపార్వతి 'బూట్లు వేసుకుని పూజలు చేసిన చంద్రబాబు ఇప్పుడు హిందూ ధర్మం గురించి మాట్లాడటం సిగ్గుచేటు. విజయవాడలో ఆలయాలను కూల్చి బాత్రూములు కట్టించిన వ్యక్తి చంద్రబాబు' అని ధ్వజమెత్తారు. సీఎం జగన్ హిందూ ఆలయాల అభివృద్ధికి కృషి చేస్తున్నారని, దుర్గగుడికి రూ.70 కోట్లు రిలీజ్ చేయటం శుభపరిణామమని పేర్కొన్నారు. చంద్రబాబు కూల్చిన గుళ్లను జగన్ కట్టించటం హర్షనీయమన్నారు. (చంద్రబాబుపై ధ్వజమెత్తిన వైఎస్సార్సీపీ ఎంపీలు) -
దేవాలయాలు కూల్చిన చరిత్ర టీడీపీ, బీజేపీలది..
సాక్షి, తాడేపల్లి: దేవాలయాలు కూల్చిన చరిత్ర టీడీపీ, బీజేపీలదేనని దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ మండిపడ్డారు. గత టీడీపీ ప్రభుత్వంలో బీజేపీ నేత మాణిక్యాలరావు దేవాదాయ శాఖ మంత్రిగా ఉండగా, 40కిపైగా దేవాలయాలను కూల్చివేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. విగ్రహాలను చెత్త బండిలో తరలించిన చరిత్ర టీడీపీ, బీజేపీలదేనని ధ్వజమెత్తారు. బుధవారం వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఏదో జరిగిపోతోందని టీడీపీ, బీజేపీ నేతలు కూడగట్టుకొని దేశవ్యాప్తంగా దుశ్ప్రచారం చేసే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. బడ్జెట్ సమావేశాల సందర్భంగా బీజేపీ నేత జీవీఎల్ నరసింహారావు చేసిన వ్యాఖ్యలని ఆయన తప్పుపట్టారు. రాజ్యసభలో జీవీఎల్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఏదో జరిగిపోతోందని దుశ్ప్రచారం చేయడం సరికాదన్నారు. టీడీపీ, బీజేపీ ఉమ్మడి ప్రభుత్వంలో 40 దేవాలయాలు కూల్చేసినప్పుడు జీవీఎల్ ఎక్కడున్నారన్నారని నిలదీశారు. ఆలయాలపై దాడుల ఘటనలపై సిట్ దర్యాప్తులో ఒక్కో నివేదిక బయటికొస్తుంటే టీడీపీ, బీజేపీ నేతలు భయంతో వణికిపోతున్నారన్నారు. బీజేపీ నేతలు కూడా కొన్ని సంఘటనల్లో ప్రత్యక్షంగా పాల్గొన్నారని ఆరోపించారు. అంతర్వేది ఘటనపై సీబీఐ దర్యాప్తుకు సిఫార్సు చేసినా, ఇంత వరకు కేంద్రం ప్రభుత్వం స్పందించలేదని, దీనికి జీవీఎల్ ఏమని సమాధానం చెప్తాడని నిలదీశారు. రాజమండ్రిలో అర్చకునికి డబ్బులిచ్చి విగ్రహాన్ని ధ్వంసం చేయించింది టీడీపీ కాదా అని ప్రశ్నించారు. దీనిపై బీజేపీ స్పందించకపోవటాన్ని ఆయన తప్పుపట్టారు. ఏపీకి రావాల్సిన నిధుల గురించి జీవీఎల్ ఏరోజైనా రాజ్యసభలో మాట్లాడారా అని నిలదీశారు. టీడీపీ ఎంపీలు అమిత్ షా అపాయింట్మెంట్ కోరడంపై ఆయన స్పందిస్తూ.. చంద్రబాబుది.. అందితే జట్టు, అందక పోతే కాళ్లు పట్టుకునే రకమని విమర్శించారు. రాష్ట్రంలో గుడులను కూల్చిన చరిత్ర టీడీపీ, బీజేపీలదైతే.. గుడులను నిర్మిస్తున్న ఘనత వైఎస్సార్‌సీపీదేనని స్పష్టం చేశారు. అంతర్వేది రథాన్ని 1.20 కోట్లతో త్వరితగతిన నిర్మించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. రామతీర్థం విగ్రహాల కోసం అశోక్ గజపతిరాజు విరాళం పంపారని, ఆ విరాళాన్ని విగ్రహాల కోసం మాత్రమే వినియోగించాలని మెలిక పెట్టడంతో ఆయన చెక్‌ను వెనక్కు పంపామని పేర్కొన్నారు. -
విగ్రహన్ని మావాళ్ళే తీసారని దమాయిస్తావా?
టెక్కలి: రాష్ట్రంలో ఆలయాలపై దాడులు, విగ్రహాల విధ్వంసానికి పాల్పడింది తమ పార్టీ వారేనని తెలిసి సిగ్గు పడాల్సింది పోయి, తప్పు చేసిన వారిని వెనకేసుకొస్తావా అంటూ చంద్రబాబుపై మత్స్యశాఖ మంత్రి డా. సీదిరి అప్పలరాజు ధ్వజమెత్తారు. సంతబొమ్మాళి మండలంలో నంది విగ్రహాన్ని తొలిగిస్తూ అడ్డంగా బుక్కైన తెలుగు తమ్ముళ్లను వెనకేసుకురావడంపై మంత్రి స్పందిస్తూ.. విగ్రహన్ని తమవాళ్లే తీసారని చంద్రబాబు దమాయించడం సిగ్గుచేటని అన్నారు. విగ్రహాన్ని తొలగిస్తే తప్పేంటని ప్రశ్నించిన ప్రతిపక్ష నేత తీరుపై ఆయన తీవ్రస్థాయిలో మండిపడ్డారు. దేవతా విగ్రహాలను రాళ్ళనుకుంటున్నారా అంటూ చంద్రబాబుపై ధ్వజమెత్తారు. తాము విగ్రహాలను దేవుని ప్రతిరూపాలుగా భావించి, పూజిస్తామని ఆయన తెలిపారు. ఏ ఎండకు ఆ గొడుగు పట్టే చంద్రబాబు అసలు హిందువేనా అన్న అనుమానాన్ని వ్యక్తం చేశారు. ఇది పద్దతి కాదని ఆయనకు చెప్పేవారెవరూ లేరా అని ప్రశ్నించారు. రాష్ట్రానికి ఇంకా తానే ముఖ్యమంత్రినన్న భ్రమలో చంద్రబాబు ఉన్నారని, ఆయన్ను అర్జెంట్‌గా మానసిక వైద్యుడికి చూపించాలని మంత్రి సూచించారు. మానసిక రోగంతో బాధపడుతున్న వారు రాజకీయాలకు అనర్హులని, ఇలాంటి వారు రాజకీయాల్లో కొనసాగితే రాష్ట్రానికి ఎంతో ప్రమాదమని ఆయన వ్యాఖ్యానించారు. కులమాతాల మధ్య చిచ్చు పెడుతున్నది తనే అని బహిర్గతమైనా, ధర్మపరిరక్షణ పేరుతో యాత్ర నిర్వహించడం సిగ్గుచేటని ఆయన మండిపడ్డారు. -
టీడీపీ కనుసన్నల్లోనే విగ్రహాల ధ్వంసం
తాడేపల్లి: రాష్ట్రంలో దేవాలయాలపై దాడులు, విగ్రహాల ధ్వంసం వెనుక టీడీపీ కుట్రలు దాగున్నాయని మంత్రి సీదిరి అప్పలరాజు వ్యాఖ్యానించారు. ఆలయాలపై దాడులు టీడీపీ కనుసన్నల్లోనే జరుగుతున్నాయని ఆయన ఆరోపించారు. శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళి మండలంలో జరిగిన ఘటన ఇందుకు ఉదాహరణ అని పేర్కొన్నారు. చంద్రబాబు చేస్తున్న విగ్రహ రాజకీయాల వెనుక ఆంతర్యం ఏమిటని ఆయన ప్రశ్నించారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో మంత్రి మాట్లాడుతూ.. సంతబొమ్మాళి మండలంలో నంది విగ్రహాన్ని తొలగిస్తూ టీడీపీ, బీజేపీ కార్యకర్తలు అడ్డంగా బుక్కైనా.. ఆయా పార్టీల నేతలు మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నారని విమర్శించారు. ఈ ఘటనలో కుట్రకోణం దాగి ఉందని, ఇందులో పాత్రదారులు టీడీపీ, బీజేపీలకు చెందిన కార్యకర్తలేనని ఆధారాలతో సహా బహిర్గతమైందని ఆయన వెల్లడించారు. ఈ విషయంలో చంద్రబాబు తీరు.. జల్లెడ వెళ్లి సూదిని వెక్కిరించినట్లుందని ఎద్దేవా చేశారు. చంద్రబాబు ఆదేశాలతోనే ఈ కుట్ర జరిగిందన్నది బహిరంగ రహస్యమని ఆయన పేర్కొన్నారు. ఈ ఘటనలో ఓ ఎల్లో విలేఖరితో పాటు అచ్చెన్నాయుడు మనుషులు కూడా ఉన్నారని మంత్రి ఆరోపించారు. నిన్న చంద్రబాబు తిరుపతి పార్లమెంటరీ బూత్ కమిటీ జూమ్ మీటింగ్‌లో చేసిన అనేక విమర్శలకు మంత్రి కౌంటరిచ్చారు. కాగా, ఆలయాల దాడులపై ఇప్పటికే 22 మందిపై పోలీసులు కేసులు నమోదు చేశారని మంత్రి స్పష్టం చేశారు. రేపటి నుంచి ఇంటివద్దకే నిత్యవసరాల పంపిణీ కార్యక్రమం సీఎం చేతుల మీదుగా ప్రారంభం కానుందని వెల్లడించారు. దీన్ని పక్కదారి పట్టించేందుకు చంద్రబాబు రకరకాల కుట్రలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. సీఎం ఢిల్లీ పర్యటనపై అవగాహన లేని లోకేష్ బాబు ఏదేదో ట్వీట్లు పెడుతున్నారని, ఆయన హెరిటేజ్ పాలు కాక అమూల్ పాలు తాగితే తెలివితేటలు వస్తాయని ఎద్దేవా చేశారు. టీడీపీకి బుద్ధి రావాలని శ్రీరాముడిని, నందీశ్వరుడిని ప్రార్ధిస్తున్నాని మంత్రి పేర్కొన్నారు. -
ఆలయాలపై దాడులు వాస్తవం
అమరావతి: రాష్ట్రంలో ఆలయాలపై జరుగుతన్న దాడులపై త్రిదండి చినజీయర్ స్వామి స్పందించారు. విగ్రహాల ధ్వంసం, ఆలయాలపై దాడుల మాట వాస్తవమేనని ఆయన అంగీకరించారు. అయితే ఈ దాడులు వివిధ రకాల దురుద్దేశాలతో జరిగి ఉండవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. అధికారంలో ఉన్నవారిని దించడానికి దుష్టశక్తులు ఇలాంటి కుట్రలకు పాల్పడి ఉండవచ్చని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. విగ్రహాల ధ్వంసానికి కనిపించని శక్తులు కుట్రలు చేస్తున్నాయని ఆయన అనుమానాన్ని వ్యక్తం చేశారు. దాడులకు పాల్పడిన వారిన పట్టుకొని కఠినంగా శిక్షించాలని స్వామి ప్రభుత్వాన్ని కోరారు. రాష్ట్రంలో ఈ అలజడిని తగ్గించేందుకే తాను ఆలయాల సందర్శన చేస్తున్నానని ఆయన పేర్కొన్నారు. ఆలయాల్లో విగ్రహాల స్థితిగతులు, సౌకర్యాలపై ప్రభుత్వానికి సలహాలు ఇస్తానని వివరించారు. దేవాలయాల సంరక్షణ బాధ్యతను ప్రజలు కూడా తీసుకోవాలని పిలుపునిచ్చారు. ప్రజల్లో భక్తి భావం పెరిగినప్పుడే ఆలయాల సంరక్షణ సాధ్యమవుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఆలయమైనా, మసీదైనా, చర్చి అయనా దాడులు సరికాదని, ఇటువంటి విధ్వంసాలను అందరూ ఖండించాలని పిలుపునిచ్చారు. ప్రజలకు మతస్వేచ్ఛ ఉందని వారు తమకిష్టమైన మతాన్ని స్వీకరించే హక్కు ఉందని స్వామి అభిప్రాయపడ్డారు. -
వారి కుట్రలను భగ్నం చేయండి : డీజీపీ
అమరావతి : దేవాలయాలపై దాడులు, కేసుల ఛేదన, అరెస్టులు వంటి అంశాలపై ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ జిల్లాల ఎస్పీలు, కమిషనర్లతో వెబినార్ నిర్వహించారు. ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ..కొంతమంది ఉద్దేశపూర్వకంగా చేస్తున్న దాడులను తిప్పికొట్టాలని పేర్కొన్నారు. మత విద్వేషాలు రెచ్చగొట్టే వారి కుట్రలు భగ్నం చేయాలన, ఇందుకు ఏపీ డీజీపీ విలేజ్ కమిటీల సేవలను వినియోగించుకుని మందుకు సాగాలని పేర్కొన్నారు. ఆలయాల పరిరక్షణకు ప్రజల సమన్వయంతో ముందుకు వెళ్లాలని, మత విద్వేషాలు రెచ్చగొట్టే మీడియా, సోషల్ మీడియాపై చర్యలు తీసుకోవాలని వివరించారు. ఆలయాలపై దాడుల్లో రాజకీయ దురుద్దేశాలు బయట పడుతున్నాయని, దానిపై ప్రత్యేక దృష్టిపెట్టి తప్పు చేసిన వారు ఎంతటివారైనా వదలొద్దని తెలిపారు. ఆధారాలతో సహా నిందితులను పట్టుకోవాలని, దాడులపై ప్రజలకు వాస్తవాలు తెలియజేయాలని పేర్కొన్నారు. -
డీజీపికి లేఖ వీర్రాజు స్థాయికి సరికాదు: వెల్లంపల్లి
సాక్షి, విజయవాడ: రాష్ట్రంలో ఆలయాలపై జరిగిన దాడుల కేసుల్లో టీడీపీ నేతల ప్రమేయం రుజువు కావడంతో ప్రతిపక్ష నేత చంద్రబాబులో ఆందోళన మొదలైందని మంత్రి వెల్లంపల్లి అన్నారు. మతపరమైన విద్వేషాలను రెచ్చగొట్టేందుకు టీడీపీ, బీజేపీలు కుట్రలకు పాల్పడ్డాయని రాష్ట్ర డీజీపీ గౌతమ్ సవాంగ్ స్పష్టం చేసిన నేపథ్యంలో, చంద్రబాబు వెన్నులో వణుకు పడుతోందని ఆయన ఎద్దేవా చేశారు. దాడులకు సంబంధించిన తొమ్మిది కేసుల్లో 21 మంది టీడీపీ, బీజేపీ నేతల పాత్ర ఉందని, వారిలో 15 మందిని అరెస్టు చేశామని ఇటీవల రాష్ట్ర డీజీపీ ప్రకటించిన విషయం తెలిసిందే. ఆలయాలపై జరిగిన దాడుల కేసులపై మంత్రి వెల్లంపల్లి మీడియాతో మాట్లాడుతూ.. దాడుల కేసుల్లో టీడీపీ, బీజేపీ నేతల ప్రమేయాన్ని బయటపెట్టిన రాష్ట్ర డీజీపీపై టీడీపీ, బీజేపీ నేతలు ఆరోపణలు చేయడం సరికాదని అన్నారు. ప్రతిపక్ష పార్టీల ప్రమేయాన్ని సాక్ష్యాధారాలతో బయటపెట్టిన డీజీపీని చంద్రబాబు, బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు టార్గెట్ చేయటాన్ని ఆయన తప్పుబట్టారు. డీజీపీనే బెదిరించేలా సోము వీర్రాజు లేఖ రాశారని, ఇది అతని స్థాయికి సరికాదని వెల్లంపల్లి హితవు పలికారు. నిజాలను నిగ్గుతేల్చినందుకు డీజీపీ రాజీనామా చేయాలా అని ప్రశ్నించారు. తిరుపతి ఉపఎన్నికల్లో లబ్ధి పొందేందుకు టీడీపీ, బీజేపీ, జనసేన కలిసి కుట్రలు పన్నుతున్నాయని ఆరోపించారు. సోషల్ మీడియా వేదికగా తప్పుడు ప్రచారం చేస్తున్నారని మంత్రి మండిపడ్డారు. బూట్లు వేసుకొని పూజలు చేసే చంద్రబాబుకు హిందువుల గురించి మాట్లాడే నైతిక అర్హత లేదని ఆయన పేర్కొన్నారు. హిందువుల మనోభావాలు దెబ్బతినేలా మాట్లాడిన జనసేనానికీ ఆయన చురకలంటించారు. అన్ని కులాలు, మతాలను గౌరవించే ఏకైక ప్రభుత్వం తమదేనని, మానవత్వమే తమ సీఎం జగన్మోహన్రెడ్డి మతం, అభిమతమని వెల్లంపల్లి పేర్కొన్నారు. ఇంతకన్నా నిదర్శనం లేదు సాక్షి, గుంటూరు: రాష్ట్రంలో పారదర్శక పాలన కొనసాగుతోందని, సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్రానికి అంతర్జాతీయ స్థాయి గుర్తింపు లభించిందని ఎంపీ మోపిదేవి వెంకటరమణ అన్నారు. జాతీయ స్థాయి ఉత్తమ ముఖ్యమంత్రుల జాబితాలోకి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికి 3వ స్థానం లభించటం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. ఇది రాష్ట్ర ప్రజలందరికీ దక్కిన గౌరవమని ఆయన పేర్కొన్నారు. ప్రశాంతంగా ఉన్న రాష్ట్రంలో మత కలహాలు సృష్టించాలని కుట్రలు పన్నుతున్నారని ఎంపీ ఆగ్రహం వ్యక్తం చేశారు. అందులో భాగంగానే కుటిల బుద్ధితో దేవాలయాలలో విగ్రహాలు ధ్వంసం చేయించడం లాంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని విమర్శించారు. విగ్రహాల ధ్వంసం, తప్పుడు ప్రచారం కేసులో అరెస్టయిన వారందరూ తెలుగుదేశం పార్టీకి చెందిన వారేనని ఆయన తెలిపారు. తమ ఉనికిని కాపాడుకోవటానికి చిల్లర రాజకీయాలు, చిల్లర వ్యవహారాలు చేస్తున్నారనడానికి ఇంతకన్నా నిదర్శనం లేదని ఎంపీ మోపిదేవి ఎద్దేవా చేశారు. -
'ఆగంతకుల రాతలు విచారకరం'
వాషింగ్టన్: యూఎస్ లోని దేవాలయం గోడపై ఆగంతకుల రాతల పట్ల భారతీయ అమెరికా సమాజాం విచారం వ్యక్తం చేసింది. ఇది ఓ రకంగా జాత్యహంకార దాడి అని ఆ సమాజం అభివర్ణించింది. ఇలాంటి ఘటన చోటు చేసుకోవడం విచారకరమని అభిప్రాయపడ్డింది. ఈ ఘటనను భారతీయ అమెరికా సమాజం ముక్త కంఠంతో ఖండించింది. యూఎస్ లోని భారతీయ సమాజం ముక్కు సూటిగా వ్యవహారిస్తుంది. అలాగే ఇతరులపై ప్రేమ, గౌరవం కలిగి ఉంటుందని హిందూ దేవాలయం ట్రస్టీ బోర్డు చైర్మన్ నిత్యా నిరంజన్ తెలిపారు. భారతీయులు అత్యంత పర్వదినంగా భావించే శివరాత్రి వేడుకులకు సిద్ధమవుతున్న తరుణంలో ఈ దారుణం ఎవరు చేశారో అర్థం కావడం లేదన్నారు. నిందితులను గుర్తించి శిక్షించే వరకు వదలబోమని హిందూ అమెరికన్ ఫౌండేషన్ ప్రతినిధి జే కన్సారా స్పష్టం చేశారు.అయితే ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యప్తు ప్రారంభించామని... ఇంతవరకు ఎవరిని అరెస్ట్ చేయలేదని పోలీసులు వెల్లడించారు. వాషింగ్టన్ రాష్ట్రంలోని సియాటెల్ మెట్రోపాలిటన్ ప్రాంతంలో హిందు దేవాలయం గోడలపై సోమవారం ఆగంతుకులు స్వస్తిక్ గుర్తును స్ప్రే చేసి... గెట్ అవుట్ అని రాసిన సంగతి తెలిసిందే.