వారి కుట్రలను భగ్నం చేయండి : డీజీపీ | DGP Gautam Sawang Conducts Webinar Meeting Over Temple Attacks | Sakshi
Sakshi News home page

వారి కుట్రలను భగ్నం చేయండి : డీజీపీ

Published Tue, Jan 19 2021 7:02 PM | Last Updated on Tue, Jan 19 2021 7:20 PM

DGP Gautam Sawang Conducts Webinar Meeting Over Temple Attacks - Sakshi

అమరావతి : దేవాలయాలపై దాడులు, కేసుల ఛేదన, అరెస్టులు వంటి అంశాలపై ఏపీ డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ జిల్లాల ఎస్పీలు, కమిషనర్లతో వెబినార్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ..కొంతమంది ఉద్దేశపూర్వకంగా చేస్తున్న దాడులను తిప్పికొట్టాలని పేర్కొన్నారు. మత విద్వేషాలు రెచ్చగొట్టే వారి కుట్రలు భగ్నం చేయాలన, ఇందుకు ఏపీ డీజీపీ విలేజ్ కమిటీల సేవలను వినియోగించుకుని మందుకు సాగాలని పేర్కొన్నారు. ఆలయాల పరిరక్షణకు ప్రజల సమన్వయంతో ముందుకు వెళ్లాలని, మత విద్వేషాలు రెచ్చగొట్టే మీడియా, సోషల్ మీడియాపై చర్యలు తీసుకోవాలని వివరించారు. ఆలయాలపై దాడుల్లో రాజకీయ దురుద్దేశాలు బయట పడుతున్నాయని, దానిపై ప్రత్యేక దృష్టిపెట్టి తప్పు చేసిన వారు ఎంతటివారైనా వదలొద్దని తెలిపారు. ఆధారాలతో సహా నిందితులను  పట్టుకోవాలని, దాడులపై ప్రజలకు వాస్తవాలు తెలియజేయాలని పేర్కొన్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement