అమ్మవారికి పూజలు చేస్తున్న స్వామీజీలు
పెందుర్తి: విశాఖ శ్రీశారదాపీఠంలో శరన్నవరాత్రి ఉత్సవాలు గురువారం ఘనంగా ఆరంభమయ్యాయి. పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి, ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామీజీల చేతుల మీదుగా ఉత్సవాలకు శ్రీకారం చుట్టారు. గణపతి పూజతో అంకురార్పణ, అనంతరం శ్రీశారదా స్వరూప రాజశ్యామల అమ్మవారికి విశేష అభిషేకాలు చేశారు.
తొలిరోజు బాలాత్రిపుర సుందరిదేవిగా అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. లోక కల్యాణార్థం పీఠంలో చండీ హోమాన్ని చేపట్టారు. ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలన్న ఆకాంక్షతో శ్రీమత్ దేవి భాగవత పారాయణం నిర్వహించారు. సాయంత్రం శ్రీశారదా స్వరూప రాజశ్యామల అమ్మవారు, చంద్రమౌళీశ్వరులకు ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర పీఠార్చన చేశారు. కాగా, శుక్రవారం అమ్మవారు మహేశ్వరి అవతారంలో దర్శనమివ్వనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment